Vaisaakhi – Pakka Infotainment

లైట్ బాయ్ ను చదివించి పోలీసు ఆఫీసర్ని చేసిన బాలయ్య

బాపు దర్శకత్వంలోఎన్టీఆర్ శ్రీనాథకవిసార్వభౌమ షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్నరోజులు….తండ్రి సినిమా అందునా పౌరాణికం కావడంతో ఆసక్తిగా షూటింగ్ కి వీలున్నప్పుడల్లా వచ్చేవాడు బాలయ్య…అదే స్టూడియోలో ఇంకోసెట్లో ఇంద్రజ హీరోయిన్ గా పరిచయమయిన జంతర్ మంతర్ షూటింగ్ కూడా జరుగుతుంది……ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూటింగ్ చూడడానికొచ్చిన బాలయ్యకి జంతర్ మంతర్ షూటింగ్ జరుగుతున్న సెట్ పక్కగా వెళ్తుండగా ఒక చిన్నకుర్రోడు లైట్ పట్టుకుని కనిపించాడు. ఎంతసేపట్నుంచి పట్టుకుని ఉన్నాడో దాని బరువుమోయలేకనో అలసిపోయి కళ్ళుతిరిగిపడిపోయేలా కనిపించాడు….షాట్ మధ్యలో ఉంది…వెంటనే బాలయ్య వేగంగా వెళ్ళి పడిపోబోతున్న కుర్రోడిని పక్కకి జరిపి షాట్ పూర్తయ్యేదాకా బాలయ్యే లైట్ పట్టుకున్నాడు…ఇది గమనించిన డైరెక్టర్ భరత్ పరిగెత్తుకుంటూ వచ్చి లైట్ చేతుల్లోకి తీసుకున్నాడు…షాట్ పూర్తవ్వగానే ఆగ్రహంతో బాలయ్య డైరెక్టర్ ని “పసిపిల్లలతో ఏంట్రా ఇది….రీల్ తగలబెట్టేస్తా” అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు…పొద్దున్నుంచి ఏమి తినకపోవడంతో బక్కచిక్కి నీరసంగా ఉన్న ఆ కుర్రోడిని తీసుకెళ్ళి కడుపునిండా అన్నంపెట్టి వాళ్ళ తల్లితండ్రుల్ని తీసుకుని రమ్మని స్టూడియో సిబ్బందితో చెప్పాడు…ఒక అరగంటలో ఆ కుర్రోడితో స్టూడియో మేనేజర్ తిరిగివచ్చాడు…పక్షవాతంతో తండ్రి, మూర్ఛరోగంతో తల్లి మంచానపడ్డారని తెలుసుకుని బాలయ్య చలించిపోయాడు…వెంటనే తార్నాకలోని హాస్పిటల్లో చేర్పించామని వాళ్ళ వైద్యానికి అయ్యే ఖర్చు అంత తానె భరిస్తానని చెప్పి…ఆ కుర్రోడిని తార్నాకలోని సరస్వతి శిశుమందిర్ లో చేర్పించి చదువు పూర్తయ్యేదాకా ఖర్చులన్నీ తానే భరించాడు…కష్టపడి చదువుకున్న ఆ కుర్రోడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని బంకురా జిల్లాలో సీఐ గా పనిచేస్తున్నాడు…ఇప్పటికీ జూన్ 10 వ తారీకు ఈ భూమిమీద ఎక్కడున్నా దగ్గిర్లోని హాస్పిటల్ కి వెళ్ళి రక్తదానం చేస్తుంటాడు…బాలయ్య మానవత్వానికి ఈ సంఘటన ఓ నిదర్శనం మాత్రమే.

.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More