తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు.. ఎన్టీఆర్ కేబినెట్ లోనూ చంద్రబాబు నాయుడు కేబినెట్ లోను ఐదు సార్లు మంత్రి గా పని చేసిన ఆయన 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1996లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు.. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించిన అయ్యన్నపాత్రుడు మరోసారి కేబినెట్లో మంత్రి పదవి ఆశించారు. అయితే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వలేకపోవడం తో స్పీకర్ అవకాశం కల్పించారు… స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషం గా ఉందన్న అయ్యన్నపాత్రుడు ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 24,676 ఓట్ల మెజార్టీతో పూరి జగన్నాథ్ సోదరుడు.. పెట్ల గణేష్ పై విజయం సాధించిన ఆయన తెలుగు సినిమా రంగం లో కూడా అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజా రవితేజ కు కంబ్యాక్ హిట్ ఇచ్చిన ఇడియట్ చిత్రాన్ని నిర్మించింది.
అయ్యన్నపాత్రుడే ఆయన సతీమణి శ్రీమతి పద్మావతి పేరు మీదుగా ఈ సినిమా ను నిర్మించారు.. దర్శకుడు స్టార్ డం కన్నా స్టోరీ మీద నమ్మకం కన్నా నర్సీపట్నం మీద అభిమానం తోనే ఈ సినిమా తీశారు.. దర్శకుడిగా నర్సీపట్నం పేరు నిలబెట్టిన పూరి జగన్నాథ్ తో కలసి ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశారు. అలాగే నర్సీపట్నం కు చెందిన మరో దర్శకుడు శ్రీరామ్ బాలాజీ కి కూడా ఈ తరహా సపోర్టె చేశారు.. స్వయంగా ఆయనే క్లాప్ కొట్టి తన ఆశీస్సులతో వీరి వీరి గుమ్మడి పండు అనే సినిమాకు నిర్మాత గా వ్యవహరించారు.. అయితే ఈ సినిమా ఆర్ధికంగా పరాజయం పాలయ్యింది.. ఇలా తెలుగు సినిమా రంగంలో కూడా ముద్ర వేసిన ఆయన ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా వ్యవహరించబోతున్నారు.. గతంలో ఎమ్మెల్యే గా, మంత్రిగా, ఎంపీ గా పని చేసానని, స్పీకర్ గా తాను ఉన్న తర్వాత పార్టీ గుర్తు రాకూడదని పేర్కొన్న అయ్యన్న గౌరవ విపక్ష సభ్యులకు కూడా అసెంబ్లీలో ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. వారికి కూడా అధికార పక్షంగా పాటు మాట్లాడేందుకు సమయం ఇస్తానని, నా పనితీరు మీరే చూస్తారన్నారని చెప్తున్నారు.