తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ దర్శకుల్లో కె. విజయ్ భాస్కర్ ఒకరు. విజయ్ భాస్కర్ అద్బుతమైన సృజనాత్మకత సామర్థ్యం ఉన్న డైరెక్టర్.ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రాలు చేయడంలో ఆయనకు మంచి పేరుంది. విజయ్ భాస్కర్ తీసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తన దర్శకత్వంలో రూపొందిన నువ్వే కావాలి,మన్మథుడు, మల్లీశ్వరి వంటి ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రాలు ప్రేక్షకుల లోబాగా ప్రాచుర్యం పొందాయి. మళ్లీ ఆయన స్వీయ దర్శకత్వంలో మరో సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ రాబోతుంది. ఉషా పరిణయం
అనే టైటిల్ తో మరో ఫ్యామిలి ఎంటర్ టైనర్ ను విడదలకు సిద్దం చేశారు. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది చిత్రం ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని విజయభాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తుంది. విజయ్ భాస్కర్ తన తనయుడు శ్రీ కమల్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా తాన్వి ఆకాంక్ష అనే తెలుగమ్మాయిన పరిచయం కాబోతుంది .ఆగష్టు 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ‘సరికొత్త ప్రేమ కథతో అన్నీ ఎమోషన్స్ తో ఉండే మంచి లవ్ స్టోరీ ఇది అందరికి నచ్చుతుంది ,ఈ చిత్రం ప్రేమకు నేనిచ్చే డెఫినేషన్ ,ఇదొక మంచి లవ్ స్టోరీ ,సినిమా లవర్స్ కు ఇదొక విందు భోజనంలా ఉంటుందన్నారు..
శ్రీ కమల్ , తాన్వి ఆకాంక్ష, సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెల కిశోర్ ,శివాజీ రాజా,ఆమని, సుధ, ఆనంద్, చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి, ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ స్టోరీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంగీతం: ఆర్ ఆర్ ధ్రువన్ ,డీఓపీ: సతీష్ ముత్యాల , ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ,దర్శకత్వం- నిర్మాత : కె. విజయ్ భాస్కర్ .
previous post
next post