Vaisaakhi – Pakka Infotainment

ఇది ‘బేబీ’ లాంటి సిన్మా కాదంటున్న ఆనంద్ దేవరకొండ

ఇప్పటిదాకా రియలిస్టిక్, న్యాచురల్ మూవీస్ చేశాను. గం గం గణేశాలో ఎనర్జిటిక్ క్యారెక్టర్ తో వస్తున్నా. ఇది టిపికల్ జానర్ మూవీ. క్రైమ్ కామెడీ కథతో ఆకట్టుకుంటుంది. ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్, స్వామి రారా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. బేబి సినిమాతో దీన్ని పోల్చుకుని చూడకండి. గం గం గణేశా వేరే జానర్ మూవీ అని చెప్పుకొచ్చారు. హీరో ఆనంద్ దేవరకొండ సినిమా పోస్టర్ మీద హీరో బొమ్మ ఉంటుంది. అతనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ సినిమా డైరెక్టర్స్ మీడియం. వారికే మొదట ప్రాధాన్యత దక్కాలి. ఇండస్ట్రీ ప్రేక్షకులు మీడియా అభిమానులు మనమంతా ఒక కుటుంబం. ఇండస్ట్రీలో ఏ మంచి జరిగినా, ఎవరు ఏది అఛీవ్ చేసినా అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇవాళ చిత్ర పరిశ్రమలో కాంపిటీషన్స్ నుంచి కంపారిజన్స్ వైపు వెళ్తున్నాం. ఎవరైనా పెద్దవాళ్లు ఏదైనా సాధిస్తే కొన్ని గ్రూప్స్ మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నాయి. అలా కాదు. మనమంతా మన ఇండస్ట్రీ వాళ్లు సాధించే విజయాలు సెలబ్రేట్ చేసుకోవాలని ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యులు ట్రిపుల్ ఆర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో ఆనంద్ ఫ్యాన్స్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ లో ఉన్న హుషారు కనిపిస్తోందని ఈ నెల 31న థియేట్రికల్ రిలీజ్ అవ్వబోతున్న గం గం గణేశా.. సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.. బేబి సినిమాను రీసెంట్ గా చూశాను. ఆనంద్ నటన, సాయి రాజేశ్ రూపకల్పన ఎంతో ఆకట్టుకుంది. వారికి నా ఆశీస్సులు అందజేస్తున్నా. ఈ సినిమా డైరెక్టర్ ఉదయ్ నా దగ్గర పనిచేశాడు. అంకితభావం, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. అతనికి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా.. తెలంగాణలో 72 పర్సెంట్, ఏపీలో 81 పర్సెంట్ ఓటింగ్ జరిగింది. ఈ సినిమాకు మాత్రం 100 పర్సెంట్ ప్రేక్షకులు ఓటేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ బేబి సినిమా ట్రైలర్ ను ఇక్కడే విడుదల చేశాం. అది జూలై నెల అప్పుడు వర్షం పడింది. ఇప్పుడు మే నెల. ఈ రోజు కూడా వర్షం పడింది. బేబి లాంటి సక్సెస్ గం గం గణేశాతో ఆనంద్ కు దక్కాలని కోరుకుంటున్నా. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ నుంచి వచ్చాడు తనకు హీరోగా చేయడం ఈజీ అని అనుకుంటారు. కానీ ఆ బ్యాగేజ్ మోయడం ఆనంద్ కు కష్టం. దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం చూశాక కుర్రాడు ఫర్వాలేదు అనుకున్నారు. కానీ సాయి రాజేశ్ చేసిన బేబితో ఆనంద్ కు బ్లాక్ బస్టర్ దక్కింది. ఆ సినిమాలో ఆనంద్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓ రెండు సీన్స్ లో సూపర్బ్ అనిపించాడని కితాబిచ్చారు.
డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ సినిమాకు ప్రాణం పెట్టే హీరో ఆనంద్ దేవరకొండ. ఆనంద్ దర్శకుడిని నమ్మితే అతను ఎలా చెబితే అలా నటిస్తాడు. ఆనంద్ బేబి టైమ్ లో నాకు డ్యాన్స్ రాదు అన్నా అనేవాడు. ఈ సినిమాలో అతని డ్యాన్స్ చూసి సర్ ప్రైజ్ అయ్యాను. చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. ప్రియదర్శన్, క్రేజీ మోహన్ లాంటి మంచి కామెడీ టైమింగ్ దర్శకుడు ఉదయ్ లో ఉంది. అతను నాకు ఈ కథ చెప్పాడు. చెప్పినట్లే స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడని తెలిపారు. హీరోయిన్లు ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, నిర్మాతలు వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి, కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని, నటుడు యావర్ (బిగ్ బాస్ ఫేమ్ ), నటుడు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, డైరెక్టర్ ఉదయ్ శెట్టి, తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొని ప్రసంగిస్తూ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More