దూసుకొస్తున్న మరో కొత్త వైరస్.. ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న
మంకీ పాక్స్

చాపకింద నీరులాగా మెల్లగా మంకీ పాక్స్ విస్తరిస్తోంది. ఇప్పటివరకు 116 దేశాలకు పాకిన ఆ వైరస్ ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (WHO) డేటా ప్రకారం, 2022 నుండి 116 దేశాలలో 99,176
మంకీపాక్స్ కేసులు నమోదు కాగా 208 మరణాలు నమోదయ్యాయి


మహమ్మారి వ్యాప్తిని పసిగట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత రెండేళ్లలో డబ్ల్యూహెచ్‌వో ఇలా ప్రకటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అమెరికా నుంచి యూరప్‌లతో పాటు భారతదేశంలో కూడా ఈ కేసులు వెలుగులోకి వచ్చిన తరువాత WHO ప్రపంచ స్థాయిలో మంకీపాక్స్‌ను పెద్ద ముప్పుగా అభివర్ణించింది. ప్రస్తుతం ఆఫ్రికాలో మాత్రమే ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ.. క్రమంగా ఇతర దేశాలలో మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం కూడా పెరుగుతోందని దీంతో అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వ్యాధికి వాక్సిన్లు ఆఫ్రికా దేశాల్లో చాలా తక్కువగా ఉన్నాయని.. దీని కట్టడికి ప్రపంచ దేశాలు సాయం అందించాలని ఆయా దేశాలు అభ్యర్థించాయని డబ్ల్యూహెచ్‌వో గుర్తుచేసింది. వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త క్లాడ్ (సూక్ష్మజీవుల నిర్దిష్ట సమూహం) నుండి వచ్చిన ఈ క్లాడ్ (lb), లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించి వివిధ మార్గాల ద్వారా పిల్లలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న మరొక క్లాడ్ (Ia) ద్వారా వైరల్ ఇన్‌ఫెక్షన్ జ్వరం, శోషరస గ్రంథులు విస్తరించడం , బాధాకరమైన దద్దుర్లు ఏర్పడటానికి కారణమై బొబ్బలు ఏర్పడి, ఆపై క్రస్ట్‌లుగా ఏర్పడి మరణానికి దారి తీస్తుంది, ముఖ్యంగా పిల్లలు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా వుందని పేర్కొంటూ అనేక దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసిన మంకీపాక్స్, అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా WHO ప్రకటించింది.

Related posts

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, బిహేవియర్ కూడా ఉండాలి.. మెగాస్టార్ చిరంజీవి

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More