ప్రాంతీయ భాషా చిత్రం తో సరిపెట్టుకున్న టాలీవుడ్

70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను (National Awards 2024) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో నిర్మించిన చిత్రాలు, నటీనటులు, ఆయా చిత్రాలకు పనిచేసిన ఉత్తమ సాంకేతిక నిపుణుల పేర్లను ఎంపిక చేస్తూ కేంద్రం ఈ జాబితాను జ్యూరి ప్రకటించింది.2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్ అందాయి. 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2022 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లన 11 మందితో కూడిన జ్యూరీ కమిటీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల్లో దుమ్ము దులిపిన తెలుగు పరిశ్రమ ఈ ఏడాది కేవలం ప్రాంతీయ భాషా చిత్రం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు మరొక మాష్టర్ తో కలసి తెలుగు నృత్య దర్శకుడు జానీ మాష్టర్ తిరు చిత్రాంబలం తమిళ చిత్రానికి అందుకోవడం తెలుగు వాళ్ళకి లభించిన మరో పురస్కారం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో హిందీ లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన కార్తికేయ 2 ఉత్తమ ప్రాంతీయ భాషాచిత్రంగా నిలిచింది.

ఉత్తమ నటుడు కేటగిరిలో మమ్ముట్టి(నాన్‌పకల్ నేరత్తు మయక్కం), రిషబ్ శెట్టి(కాంతార), విక్రమ్(పొన్నియన్ సెల్వన్), విక్రాంత్ మాసే(12th ఫేయిల్) బరిలో నిలువగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డునుకాంతార లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను రిషబ్ శెట్టి సొంతం చేసుకున్నాడు. గత ఏడాది అల్లు అర్జున్ తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న విషయం తెలిసిందే..బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరి లో కాంతార (కన్నడ ) అందుకోగా ఉత్తమ జాతీయ చిత్రం గా మలయాళ చిత్రం ఆట్టం ను పురస్కారం వరించింది.


ఉత్తమ నటి గా నిత్య మీనన్ ( తిర చిత్రాంబలం), మానసి పరేఖ్ ( కఛ్ ఎక్స్ ప్రెస్ ) ఉత్తమ సహాయ నటుడు పవన్ రాజ్ మల్హోత్రా (ఒరియా ) ఉత్తమ నటి సహాయ నటి నీనా గుప్తా (ఉంచాయి) ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ( ఉంచాయి) బెస్ట్ సినిమాటోగ్రఫీ – రవివర్మన్ (పొన్నియన్ సెల్వన్ -1)
బెస్ట్ మ్యూజీషియన్ – శివ, ప్రీతమ్ ( బ్రహ్మాస్త్ర) బెస్ట్ రీ రికార్డింగ్ – ఏఆర్ రెహమాన్ ( పొన్నియన్ సెల్వన్ 1) బెస్ట్ కొరియోగ్రాఫర్స్ – జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ ( తిరుచిత్రాంబలం) బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ – అన్బరివు (కేజీఎఫ్ )ఉత్తమ ప్రాంతీయ చిత్రాల జాబితాలో తమిళ్ – పొన్నియన్ సెల్వన్ -1 కన్నడ – కేజీఎఫ్ 2 మళయాలం – సౌదీ వెళ్లక్క ఒరియా – ధమన్ మరాఠీ – వాల్వ హిందీ – గుల్ మొహర్ బెంగాలీ – కబేరీ అంతర్దాన్
పంజాబీ – బాగీ డీ దీ ఎంపికయ్యాయి.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More