ఫలితాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన దగ్గరనుంచి నేతల పల్స్ స్పీడందుకుంది.. జూన్ 4 న ఎలాంటి వార్త వినలో అన్న టెన్షన్ మొదలయింది.. ఎవరి లెక్కల్లో వాళ్ళుంటే కొన్ని నియోజకవర్గాల్లో థర్డ్ మెన్ ఎవరి ఓట్లను భారీగా లాగేసుకుంటున్నారు అన్న లెక్క మరింత కలవరపెడుతోంది.. గత ఎన్నికల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించిన విశాఖ నార్త్ ఈసారి ఇద్దరు రాజుల్ని బెంబేలెత్తిస్తోంది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం లో ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలు జరగగా మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్ధి తైనాల విజయకుమార్ గెలుపొందగా 2014లో తెలుగుదేశం మద్దతు తో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు.. 2019 వైసీపీ వేవ్ లో కూడా టీడీపీ అభ్యర్థి గంటా గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన కేకే రాజు ఈ సారి కూడా వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పై పోటీ చేస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది. ఈసారి ఈ నియోజకవర్గం లో మరో కీలక వ్యక్తి జేడీ లక్ష్మీ నారాయణ రంగంలోకి రావడం తో ఇప్పుడు ఇద్దరు రాజుల్లో కంగారు కు కారణమైంది. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ గా జనసేన తరపున పోటీ చేసిన జేడీ ఈసారి తన సొంత పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ తరపున ఎమ్మెల్యే బరిలోకి దిగారు.. గత ఎన్నికల్లో కేవలం 4414 ఓట్ల తేడాతో పరాజయం పాలైన శ్రీ భరత్ ఓటమి కి జేడీ కి పోలైన 2,88,874 ఓట్లే కారణమని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. విశాఖ లో నాలుగు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న టీడీపీ జేడీ కి పడ్డ క్రాస్ ఓటింగే టీడీపీ ఎంపీ క్యాండిట్ కి దెబ్బేసెసింది. ఇప్పుడు కూడా అప్పటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయితే అది ఎవరి ఓటమికి కారణం కాబోతుందన్నదే ఈ అభ్యర్థుల టెన్షన్ కి అసలు కారణం.. కేకే రాజు ఒక్క జేడీ కి పోలైన ఓట్ల లో తమ నుంచి పోయిన ఓట్లు ఎంత అన్నదొకటే టెన్షన్ అయితే కూటమి అభ్యర్థి కి అదనంగా ఇండిపెండెంట్ అభ్యర్థి వడ్డే శిరీష కు కేటాయించిన గ్లాస్ గుర్తు.. మరో ఇండిపెండెంట్ కి ఇచ్చిన బకెట్ గుర్తు.. గ్లాస్ అభ్యర్థి కూటమి కి మద్దతు ప్రకటించిన బెంగ అయితే పోలేదు.. జైభారత్ పార్టీ అభ్యర్థి జేడీ కి ఎక్కువ ఓట్లు పోలైతే అది కచ్చితంగా విష్ణుకుమార్ రాజు గెలుపు పై తప్పక ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. 2019 లో ఓటమి పాలైన తరువాత కేకే రాజు సైలెంట్ గా ఉండకుండా ఏదో ఒక కార్యక్రమంతో జనాలు, మీడియా మధ్య ఉంటూనే వున్నారు.. దాంతో ఆయనకు ఉన్న సాలీడ్ ఓట్ బ్యాంక్ చెక్కు చెదిరే అవకాశం లేదు.. అలాగే కూటమి కున్న ఓటు బ్యాంక్ ని జేడీ భారీ గా స్ప్లిట్ చేస్తే మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు..
కొంతమంది గెలవలేకపోయిన వేరే వాళ్ళ గెలుపు పై తీవ్ర ప్రభావం చూపిస్తారు.. ఇప్పుడు రెండోసారి జేడీ వంతు వచ్చింది.