నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి చిత్రంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొన్ని సంభాషణలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడం అవి మీమ్స్ గా ఇతర రూపాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇవి మరింత వ్యాప్తి చెందితే ప్రభుత్వానికి ఇబ్బంది అని కలవరపడడంతో సినిమాపై అనధికార విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. డైలాగ్స్ ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి వాడారు. ఎందుకు వాడారు..? అన్న దానిపై ప్రభుత్వఆదేశాలతో కొంతమంది అధికారులు విజయవాడలో సినిమా చూసి అందులో ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మరి కొంతమంది మంత్రులకు వ్యతిరేకంగా డైలాగ్స్ ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. దీనిపై ఓ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించనున్నారని తెలుస్తుంది. సమర్పించిన రిపోర్టుపై ఏ పి ప్రభుత్వం అధికారులు, పార్టీ ప్రముఖులతో చర్చలు జరుపుతోంది. అయితే ఇప్పటికే cbfc యూ/ఏ సర్టిఫికెట్ ను ఇవ్వడం తో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. కోర్టుకు వెళ్లి దీనిని ఆపాలా.. అన్న దానిపై తీవ్ర తర్జన భర్జన జరుగుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా స్వయంగా హిందూపూర్ శాసనసభ్యుడైన బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాకు నెగిటివ్ టాకు కొన్ని వర్గాలే పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని ఇందులో డైలాగ్స్ బాగా గుచ్చుకున్న వారు ఇలాంటి టాక్స్ స్ప్రెడ్ చేస్తున్నారని అభిమానులు ఓవైపు ఆరోపిస్తున్నారు. ప్రజలను బాగా ఆకట్టుకున్న డైలాగులు పై కత్తెర వేస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరిస్తున్నారు. సినిమాగా చూడాలకే తప్ప ఇలాంటి సిల్లీ చేష్టలకి పాల్పడకూడదని వారంటున్నారు.