కళ్ళు లేకపోయినా ఫస్ట్ ఎటెంప్ట్ లో సివిల్స్ టాప్ రాంక్….దేశంలోనే తొలి అంధ ఐ ఏ ఎస్ గా రికార్డ్…!

కేరళలోని తిరువనంతపురం జిల్లా సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించే ఆ అధికారి దేశం లోనే ప్రత్యేకం.. మహారాష్ట్రలోని ఉల్హాసనగర్ కు చెందిన ఆమె దేశం లోని తొలి అంధ మహిళా ఐఏ ఎస్. ఆరేళ్లప్పుడు క్లాస్‌లో ఓ అబ్బాయి పొరపాటున పెన్సిల్‌తో కంట్లో గుచ్చితే చూపు పోయింది. అప్పుడే డాక్టర్లు ‘ఆ గాయం తాలూకు ఇన్‌ఫెక్షన్ రెండో కన్నుకీ సోకింది. నెమ్మదిగా ఆ కన్ను చూపూ పోవచ్చు’ అని చెప్పారు. డాక్టర్లు చెప్పినట్టుగానే యేడాదికి రెండో కన్ను చూపూ పోయి పూర్తి అంధురాలయ్యింది.. తానొకటి తలిస్తే దైవమోకటి తలచింది.ఆరేళ్ల వయసు లో చూపును కోల్పోయిన స్థైర్యాన్ని కోల్పోని ఆమె పేరు ప్రాంజల్ పాటిల్( Pranjal Patil).. దాదర్‌లోని కమలా మెహతా స్కూల్ ఫర్ బ్లైండ్‌లో పాఠశాల విద్యను, చండీబాయి కాలేజ్‌లో ఇంటర్, హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ (హెచ్ఎస్‌సీ) పరీక్షల్లో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఇంటర్‌లో ఉన్నప్పటి నుంచే సెయింట్ జేవియర్స్‌లో చదవాలని నా కల.. ముంబైలోని కమలామెహతా దాదర్ అంధుల పాఠశాలలో చదువుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో డిగ్రీపట్టా పొందారు. తర్వాత ఢిల్లీ జేఎన్ఎయు నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పీజీ పూర్తి చేశారు.ముంబై.. ఉల్లాస్‌నగర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబం ఉల్లాస్‌నగర్ నుంచి సీఎస్‌టీ (ముంబైలో ఒక ప్రాంతం)కి రోజూ లోకల్‌ట్రైన్‌లో ప్రయాణం. రోడ్డు దాటాలన్నా ఎవరో ఒకరు సాయం చేయాల్సిందే.

ట్రైన్ ఎక్కడానికీ ఎవరో ఒకరి తోడు కావాల్సిందే. సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో చదవడం నా కల అని గట్టిగా చెప్పే ఆమెకు సివిల్స్ గురించి, ఇండియన్ అడ్మిన్‌స్ట్రేటివ్ సర్వీస్ గురించి పరిచయం చేసింది. ఆ కాలేజే..ఆమె 2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్ సాధిస్తే భారత రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఎఎస్)లో ఉద్యోగం వచ్చింది. అయితే ప్రంజల్ అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి ఉన్నత అధికారులు తిరస్కరించారు. పట్టు వదలని ప్రంజల్ నెక్స్ట్ ఇయర్ జరిగిన యూపీఎస్సీ పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ గా ఎంపికైంది. నాలుగు గంటల్లో పరీక్ష రాయడం నిజానికి పెద్ద సవాలే. చెప్పింది చెప్పినట్టు పరీక్ష రాసి పెట్టగల వాళ్లను పట్టుకోవడం ఇంకా కష్టం..చివరకు విదుషీ అనే ఒక ఫ్రెండ్ సపోర్ట్ చేసింది. పరీక్ష కన్నా ముందే మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ తో ప్రాంజల్ మాటకు విదుషీ రాత స్పీడ్‌కి సరిపోతుందో లేదో చెక్ చేసుకోని ఓ పదిసార్లు మాక్ టెస్ట్ పెట్టుకుని ఫుల్ ప్రాక్టీస్ అయి గొప్ప ర్యాంక్ తో నిలిచింది. ఇప్పుడు నా కన్నా విదుషీ కే ఐఏఎస్ వచ్చినంత సంబరపడిపోతోంది. థ్యాంక్స్ టు హర్ అని ఆమె కి కృతజ్ఞతలు తెలుపుతోంది ప్రాంజల్ , ఏడాది శిక్షణలో ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు!మొదటి అటెంప్ట్‌లోనే ఆల్ ఇండియా 773 ర్యాంక్‌ను సాధించిన 26 ఏళ్ల అంధురాలు ప్రాంజల్ పాటిల్ సివిల్స్‌లో ఆల్ ఇండియా 773 ర్యాంక్ సాధించానంటే ఘనత టెక్నాలజీదే అని చెప్తారు ఆమె . అంధుల కోసం ప్రత్యేకంగా తయారైన యాక్సెస్ విత్ స్పీచ్ అనే సాఫ్ట్‌వేర్‌ సాయంతో తక్కువ సమయంలో ఎక్కువ మెటీరియల్‌ను బ్రెయిలీ లిపిలో కంప్యూటర్ స్క్రీన్‌మీద డిస్‌ప్లే అయ్యే ఈ మెటీరియల్‌ను వింటూ మననం చేసుకోవచ్చు. లేదంటే సొంతంగా చదువుకోవచ్చు. నేను వింటూ మననం చేసుకునేదాన్ని. పుస్తకాలను తెచ్చుకొని స్కాన్ చేసుకొని అందుకు వీలు కల్పించే జేఏడబ్ల్యు అనే మరో సాఫ్ట్‌వేర్ కూడా తనకు ఎంతో హెల్ప్ అయిందంటారు ప్రాంజల్. 773వ ర్యాంకు ఆధారంగా ఇండియన్‌ రైల్వేస్‌లో అకౌంట్స్‌ సర్వీస్‌లో ఉద్యోగం రావాలి. కానీ ఆ ఉద్యోగంలో చేరడానికి అధికారులు అడ్డుకున్నారు.. ఇండియన్‌ రైల్వేస్‌లో అకౌంట్స్‌ సర్వీస్‌లోని ఉద్యోగానికి ర్యాంకు ఒక్కటే సరిపోలేదు. దృష్టి కూడా కావలసి వచ్చింది. అప్పుడే ‘‘నా రియల్ టార్గెట్‌ ఇదికాదు. నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదు అంటూ మళ్లీ సివిల్స్ కి ప్రిపేరయి మరుసటి సంవత్సరమే124వ ర్యాంక్ సాదించింది..ప్రాంజల్ భర్త కోమల్‌సింగ్ పాటిల్. ఒజర్ ఖేడాలో ఓ కేబుల్ ఆపరేటర్‌ ఆమె లక్ష్యానికి ఫుల్ సపోర్ట్. ప్రాంజల్‌కి కేరళ కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా ఫస్ట్ ఎర్నాకుళంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పోస్టింగ్‌ వచ్చింది. త‌ర్వాత‌ తిరువనంతపురం సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వ‌ర్తించారు. ప్రాంజల్‌ త్రివేండ్రంలో కూడా సబ్‌కలెక్టర్‌గా ప‌నిచేశారు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More