టీడీపీ ముందస్తు మ్యానిఫెస్టో

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ని విజయతీరాలకు చేర్చిన చాలా పథకాలు కు తెలుగుదేశం పార్టీ తన మ్యానిఫెస్టోలో పెద్ద పీట వేసింది.. ముందస్తు ఊహల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తొలి మ్యానిఫెస్టో ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మహానాడు వేదిక ప్రకటించింది.. 2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంతో మ్యానిఫెస్టో పై అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకెళ్తున్న పార్టీ ఎన్నికల నగారా మ్రోగించింది. యువత కు, మహిళలకు, రైతులకు పెద్దపేట వేసిన టీడీపీ ఆది నుంచి అండగా ఉన్న బీసీలకు పెద్దపీట స్థానం వేసింది. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహాశక్తి పేరుతో పథకాన్ని తీసుకుని వస్తామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపడుచులకి “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. దీనితో పాటే ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందించేలా తెలుగుదేశం హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణియించారు. “ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం.పూర్ టూ రిచ్ మినీ మ్యానిఫెస్ట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు రిచ్ టూ పూర్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం తో పేదలను సంపన్నులను చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడగు వేయనుంది. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా టీడీపీ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వెల్లడించారు.. వైఎస్సార్సీపీ హయాంలో 26 మందికి పైగా బీసీలు హత్యకు గురైయ్యారని 50 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారని రాష్ట్రంలో 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయని పేర్కొంటూ బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలిచేలా ఈ చట్టాన్ని తీసుకుని వస్తోంది. అలాగే టీడీపీ అధికారంలోకి రాగానే “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుందని చెప్తూనే రాష్ట్రంలో అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని తెలుగుదేశం నిర్ణయించింది. యువత కోసం ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు 2500 రూపాయలను తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఇస్తుందని ప్రజల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. ముందస్తు తప్పదన్న సంకేతాలు వస్తున్న తరుణంలో టీడీపీ ముందస్తు మ్యానిఫెస్టోతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయినట్టే.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More