కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ని పొగిడినచినముషిడివాడ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కి వైసీపీ ప్రభుత్వం కల్పించినకేటగిరీ స్థాయి భద్రత ను ప్రస్తుత ప్రభుత్వం తొలగించనుంది. పీఠం దగ్గర ఉన్న పోలీసు పికెట్ ను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. స్వామి భద్రతకు నెలకు 20 లక్షల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించడాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో పేరున్న, ఆదరణ ఉన్న స్వాములకు లేని భద్రత
ఈయనకు ఎందుకు అని సెక్యూరిటీ తొలగించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్థాన గురువుగాపేరుపడిన స్వరూపానంద అన్యాయాలపై విచారణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. అందులో భాగంగా ముందుగా భద్రతను తొలగించారన్న ప్రచారం జరుగుతోంది..
నలుగురు గన్ మెన్లు,ఆరుగురు సిబ్బందితో పెందుర్తి పీఠం దగ్గర ఉన్న పికెట్ లోఒక ఎస్ ఐ ఇన్చార్జిగా ఉండి భద్రత ను పర్యవేక్షించేవారుదీనికి అదనంగా ప్రోటోకాల్ కారు (బుగ్గకారు)వుండేది. వీటన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.