‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటూ హిస్టరీ ని క్రియేట్ చేసిన ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న పుష్ప 2 మొదట ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకవస్తున్నామని ప్రకటించిన మేకర్స్ తాజాగా డిసెంబర్ 6, 2024న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. షూటింగ్ పార్ట్‌తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, టెక్నికల్‌గా మరింత అత్యున్నత విలువలతో, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలనే వుద్దేశంతో సినిమా విడుదల తేదిని మార్చినట్లు తెలిపారు.
‘పుష్ప ది రైజ్’ చిత్రంలో తన నటనతో
మొట్టమొదటిసారిగా తెలుగు కథానాయకుడు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోవడం, అలాగే మొట్టమొదటిసారిగా దుబాయ్ మ్యాడమ్ టుసార్ట్స్‌లో దక్షిణ భారతదేశ నటుడి స్టాట్యూని, గ్యాలరీని ఏర్పాటు చేయటం తెలుగు వారందరికీ గర్వకారణం అయ్యే అంశాలన్నీ ‘పుష్ప’ చిత్రంతోనే సంతరించుకున్నాయి.
‘పుష్ఫ 2: ది రూల్’తో మరోసారి ప్రపంచంలోని సినిమా అభిమానులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపాన్ని చూడబోతున్నారు. 90 సంవత్పరాల తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి తెలుగు నటుడి నటన చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయంటే.. ‘పుష్ప’ ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.