డిసెంబర్ 26 న స్క్విడ్ గేమ్ సీజన్ 2

కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకున్న సర్వైవల్ థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఈ ఏడాది చివరిలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రముఖ ఓటీటీ(OTT) దిగ్గజం నెట్ఫ్లిక్స్ (NETFLIX) తెలిపింది. కొరియన్ టెలివిజన్ సీరీస్ గా కొరియన్ రచయిత, టెలివిజన్ నిర్మాత హ్వాంగ్ డాంగ్-హ్యూక్ టెలివిజన్ కోసం నిర్మించిన ఈ దక్షిణ కొరియా డిస్టోపియన్ సర్వైవల్ థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల వారిని ఆకట్టుకుని రెండవ సీజన్ ఎప్పుడొస్తుందా..? అని డిమాండ్ చేసేలా చేసింది.. వారి ఉత్కంఠ కు తెర దించుతూ నెట్ ఫ్లిక్స్ విడుదల తేదీని ప్రకటించింది. అయితే ఈ సీజన్‌ను ఎక్స్క్లూజివ్ గా నెట్‌ఫ్లిక్స్ నిర్మించింది. దర్శకుడు హ్వాంగ్ డాంగ్-హ్యూక్ మాట్లాడుతూ రాబోయే కొత్త ఎపిసోడ్‌లు ఇన్నాళ్ళ మీ వెయిటింగ్ కి పూర్తి న్యాయం చేస్తాయని హామీ ఇచ్చారు. ఈసారి ఒలింపిక్స్ పారిస్‌ను కాంతులతో నింపవచ్చు గానీ నిజమైన గేమ్ మాత్రం ఈ శీతాకాలంలో మాత్రమే రాబోతోందని వ్యాఖ్యానించారు..
రెండవ సీజన్‌ లో లీ జంగ్-జే , వై హా-జూన్ లీ బైయుంగ్-హున్ నటించారు. సీజన్ వన్ లో జరిగే సీక్రెట్ గేమ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 456 మంది ఆటగాళ్ళ మధ్య 45.6 బిలియన్స్ ను గెలుచుకునే అవకాశం కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి గేమ్ ఆడతారు. సీజన్ 1 చివరిలో ఫ్రంట్ మ్యాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి మరియు గేమ్‌ను మంచిగా ముగించేందుకు మళ్లీ గేమ్‌లో చేరాడు.”స్క్విడ్ గేమ్ గెలిచిన మూడు సంవత్సరాల తర్వాత, ప్లేయర్ 456 అతని కొత్త రిజల్యూషన్‌తో “గి-హన్ మరోసారి మిస్టీరియస్ సర్వైవల్ గేమ్‌లోకి ప్రవేశిస్తాడు, 45.6 బిలియన్ల బహుమతిని గెలుచుకోవడానికి సేకరించిన కొత్త పాల్గొనే వారితో మరొక లైఫ్ లేదా డెత్ గేమ్‌ను సీజన్ 2 లో మొదలుపెడతాడు.


లీ జంగ్-జే, లీ బ్యూంగ్-హున్, వై హా-జున్ , గాంగ్ యూతో పాటు యిమ్ సి-వాన్, కాంగ్ హా-నెయుల్, పార్క్ గ్యు-యంగ్, లీ జిన్-యుక్, పార్క్ సంగ్-హూన్, యాంగ్ డాంగ్-గ్యున్, కాంగ్ ఏ-సిమ్, లీ డేవిడ్, చోయి సెంగ్-హ్యూన్, రోహ్ జే-వోన్, Jo Yu-ri, మరియు Won Ji-an స్క్విడ్ గేమ్ సీజన్ 2లో కనిపిస్తారని తెలుస్తోంది. 74వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీస్‌లో డ్రామా సిరీస్‌కు దర్శకత్వం వహించినందుకు అవార్డును గెలుచుకున్న మొదటి ఆసియా దర్శకుడిగా చరిత్ర సృష్టించిన ఎమ్మీ విజేత హ్వాంగ్ సీజన్ 2 కి రచయిత, దర్శకుడు బాధ్యతలతో పాటు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More