టెక్నాలజీని అందిపుచ్చుకోవడం లో ఎప్పుడూ అప్డేట్ లో వుండే కథానాయిక శ్రుతి హాసన్ తాజాగా మెన్స్ ఎక్స్పీ (MensXP) మ్యాగజైన్ అక్టోబర్ సంచిక కోసం ఏఐ టెక్నాలజీని వాడిన ఫోటో షూట్ తో దర్శనం ఇచ్చారు. ఏఐ టెక్నాలజీ వాడి చేసిన ఫోటో షూట్ చూస్తుంటే.. వీక్షకులను భవిష్యత్ ప్రపంచంలోకి తీసుకువెళుతున్నట్టుగా ఉంది. శృతి హాసన్ టైమ్-ట్రావెలింగ్ కథానాయికగా కనిపించే ఈ డిజిటల్ అద్భుతం భౌతిక, డిజిటల్ రంగాలను మిళితం చేస్తున్నట్టుగా ఉంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను, స్వీకరించడానికి శ్రుతి హాసన్ ఎంతగా ఇష్టపడుతుంటారో ఈ కవర్ పేజ్ చూస్తేనే అర్థం అవుతోంది.
శ్రుతి హాసన్‌ను ఈ మ్యాగజైన్ “ప్రకృతి శక్తి”గా సముచితంగా వర్ణించింది. మ్యాగజైన్ అక్టోబర్ 2024 సంచిక శ్రుతి హాసన్ టైమ్-ట్రావెలింగ్ అడ్వెంచర్, ఆవిష్కరణ, కల్పనతో రూపొందించబడిన భవిష్యత్తును అందిస్తుంది. ఇలాంటి వినూత్న ప్రయత్నాలకు అతీతంగా శ్రుతి హాసన్ తన సినీ కెరీర్ మీద ఫోకస్‌గా ఉన్నారు. ఆమె ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి “కూలీ” చిత్రంతో ఆడియెన్స్‌ను ఆకట్టుకోనున్నారు.
శ్రుతి హాసన్ తన క్రాఫ్ట్ పట్ల అచంచలమైన అంకితభావంతో ఉంటారు. విభిన్న మాధ్యమాలు, భిన్న కళల ద్వారా శ్రుతి హాసన్ తన టాలెంట్‌ను ప్రదర్శిస్తుంటారు. శ్రుతి హాసన్ తెరపైనే కాకుండా, సంగీత ప్రదర్శనలతోనూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. సేవా కార్యక్రమాల్లోనూ శ్రుతి హాసన్ ముందుంటారు. వివిధ స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలుస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే.