సినిమా స్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి ఏపీలో కూటమికి మద్దతు ఇవ్వడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చిరంజీవి పంచతంత్రంలో ఒక పాత్ర మాత్రమేనని ఇటువంటి వ్యక్తులను చంద్రబాబు నాయుడు తన చుట్టూ పెట్టుకొని అధికారం కోసం పడుతున్న తపన ఏంటో తెలుస్తుందని ఎద్దేవ చేశారు. అటు పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవి చంద్రబాబు నాయుడుని సీఎం చేయాలని పట్టుదలతో పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాలలో లేనంటూ చెప్తున్న చిరంజీవి బ్యాంకులకు కోట్ల రూపాయలు అప్పు ఎగ్గొట్టిన సీఎం రమేష్ ను పక్కన కూర్చోబెట్టుకుని కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పడం హాస్యాస్పదమన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ఇంతమంది ఏకమవుతున్నారని చెప్పారు. చిరంజీవి తటస్థంగా ఉంటూతన తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలవాలని ఆయన ఆశించడంలో తప్పులేదు. అందుకే జనసేన పార్టీకి విరాళం అందజేశారు. కానీ ఇప్పుడు నేరుగా వాళ్లతో కూడా కలిసిపోయి జగన్ ప్రభుత్వం మళ్లీ రాకూడదని చిరంజీవి అభిప్రాయపడటం మంచిది కాదన్నారు.. చంద్రబాబు నాయుడు ను సీఎం చేయడానికి ఎంతమంది రంగంలోకి దిగిన సరే చివరకు వైసీపీ యే గెలుస్తుందని జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయి తీరుతారని సజ్జల రామకృష్ణారెడ్డి జోష్యం చెప్పారు.