రేవంత్ రెడ్డిని డైరెక్టర్స్ డే ఈవెంట్ కు ఆహ్వానించిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్

తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎల్బీ స్టేడియం లో నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డే ఈవెంట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ లు ఆహ్వానాన్ని అందజేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి హాజరు కానున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందని, ప్రపంచ సినిమాకు టాలీవుడ్ హబ్ గా మారేలా చేద్దామని సీఎం చెప్పినట్లు టీఎఫ్ డీఏ అధ్యక్షుడు వీరశంకర్ తెలిపారు. ఐదు నిమిషాలు మాట్లాడాలని వెళ్తే సుమారు గంట సేపు మాతో సినిమా ఇండస్ట్రీ గురించి సీఎం మాట్లాడటం హ్యాపీగా అనిపించింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి సీఎం గారి విజన్ కు ఆశ్చర్యం వేసింది. ప్రపంచ సినిమా హబ్ గా టాలీవుడ్ మారాలని, ఆ దిశగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వరల్డ్ క్లాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించాం. డైరెక్టర్స్ డే ను ప్రపంచమంతా గుర్తుపెట్టుకునేలా చేస్తున్న ఈ ఈవెంట్ కి ముఖ్యమంత్రి తప్పకుండా వస్తామని మాటిచ్చారు. అని చెప్పారు.

Related posts

నాలుగున్నర దశాబ్దాల అప్పటి పాన్ ఇండియా ‘శంకరాభరణం’

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, బిహేవియర్ కూడా ఉండాలి.. మెగాస్టార్ చిరంజీవి

గేమ్ ఛేంజర్ తో బాక్సాఫీస్ బద్దలైపోవాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More