తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎటువంటి విమర్శలు చేయవద్దంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ అధిష్టానానికి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు కొందరు ఆ పార్టీ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చంద్రబాబు తో గురు శిష్యుల బంధం గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యానం పై కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అలాగే ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు జరిగిన ఒక సభలో నేరుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీలను రేవంత్ రెడ్డి విమర్శించడం జరిగింది. కొంచెం ఘాటు విమర్శలు చేసినప్పటికీ టిడిపి కేడర్ నుంచి మాత్రం పెద్దగా రియాక్షన్ అయితే లేదు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిని టిడిపి వాళ్ళు తమ మనిషిగానే భావిస్తున్నారు. అయితే గురుశిష్య కామెంట్ పై మాత్రం అభిమానులు కాస్తంత ఆవేదన చెందిన మాట వాస్తవం. అది గ్రహించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేవంత్ పై కామెంట్స్ చేయొద్దని సూచనలు ఇచ్చినట్లు సమాచారం.ఈ కారణంగా రేవంత్ రెడ్డి తెలంగాణలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా సాఫీగా కొనసాగేలా అవసరమైతే టీడీపీ నుంచి సహకరించాలని టిడిపి అధిష్టానం చర్చించుకున్నట్లు గుసగుస.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేపట్టినప్పటి నుంచి పాలన మీద తప్ప పక్క రాష్ట్రాల రాజకీయాలపై పెద్దగా విమర్శలు అయితే చేసింది లేదు. కానీ తన ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అలాగే గత ముఖ్యమంత్రి అతని మంత్రివర్గాన్ని టార్గెట్ చేశారు.అలాగే బిజెపిని కూడా వదలలేదు.గత ఎన్నికలలో అక్కడ పూర్తి చేయాలని భావించిన టిడిపి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవడంతో అది కాంగ్రెస్ కి కలిసి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరుగా స్పష్టంగా చేయడం జరిగింది.ఎలాగైనా రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి గట్టిగా పని చేశారని బిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు.ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత వచ్చే రిజల్ట్ ను బట్టి ఇక్కడ రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.ఇక్కడ బిజెపి, టిడిపి, టిడిపి జనసేన కూటమి గెలిస్తే కచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాగూ చంద్రబాబు నాయుడు శిష్యుడు కావడంతో ఇక ఇరు రాష్ట్రాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు పెరుగుతాయని ప్రజల భావిస్తున్నారు.