మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్” టీజర్ ను రవితేజ విడుదల చేసారు. సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. “పెళ్లి సందడి” దర్శకురాలు గౌరీ రోణంకి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో కాలేజ్ టాపర్ అయిన సత్య మెరిట్ ను బీట్ చేయడం ఎవరి వల్లా కాదు. అలాంటి టైమ్ లో కాలేజ్ లో అడుగుపెట్టిన హీరో (మాధవ్) హీరోయిన్ ని గుణింతంతో పిలుస్తూ సరదాగా టీజ్ చేస్తు అల్లరిగా సాగే వీరి స్నేహం ప్రేమగా ఎలా మారింది ? అనేది టీజర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. మాధవ్ రవితేజలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. స్టైలిష్ లుక్స్ తో పాటు పర్ ఫార్మెన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మిస్టర్ ఇడియట్” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికిసినిమాటోగ్రఫీ రామ్,ఆర్ట్ కిరణ్ కుమార్ మన్నె,ఎడిటింగ్ విప్లవ్, ఇతర ముఖ్య సాంకేతిక వర్గం.