ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం శుక్రవారం ఉదయం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛ రణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో మందాకిని నది పై భాగంలో మంచుకొండల మధ్య నెలకొన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఏడాది లో దీపావళి నుంచి అక్షయ తృతీయ వరకు మంచుతో కప్పబడి గుడి తలుపులు మూసి ఉంటాయి వైశాఖ తృతీయ రోజున వేదపండితుల సమక్షంలో గుడి ద్వారాలు తెరుచుకున్నాయిఈ సందర్భంగా కేదారేశ్వరు డికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతి ర్లింగాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి. చార్‌ధామ్ యాత్రలో కేదార్ నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ప్రతి యేటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పరమేశ్వరుడి దర్శనం కోసం కేదార్‌నాథ్‌కు వస్తుం టారు. కానీ, శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. దాదాపు ఆరు నెలల పాటు ఇలాగే ఆలయం మూసి ఉంచడం జరుగుతుంది. నేడు ఆరు నెలల తర్వాత తిరిగి తెరిచిన సందర్భంగా అధికారులు ఆలయాన్ని పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరిం చారు.సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తా బు చేశారు. భక్తులు ఉద యం నుంచే ఆలయానికి క్యూ కట్టారు. మరోవైపు యమునోత్రి ఆలయం కుండా ఉదయం 7 గంటలకు గంగోత్రిఆలయం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరుచుకోగా ఇక చార్‌ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని మాత్రం ఈ నెల 12న తెరవనున్నట్లు సమా చారం…