టాలీవుడ్ లో రవితేజ దర్శకుల హవా

కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ, కొన్ని సినిమాలలో చిన్నాచితకా వేషాలు వేస్తూ అలా అంచలంచెలగా ఎదిగి టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్న రవితేజ కు పరిశ్రమ లో తనకంటూ ఎవరు గాడ్ ఫాదర్ లేనప్పటికీ స్వశక్తితో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అప్పట్లో స్ట్రగుల్ పడుతున్న సమయంలోనే దర్శకుల వద్ద అసిస్టెంట్లుగా చేస్తూ తమ కెరీర్ ను ప్రారంభించిన అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్ లుగా మారి విజయవంతమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదిగారు.గతంలో తనతో జర్నీ చేసిన చాలామందికి రవితేజ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. అలా కొంతమందిని కొత్త డైరెక్టర్ లను ను పరిచయం చేశాడు.మరి కొంతమందికి వరుసగా సినిమాలిస్తూ వారి కెరీర్ ని నిలబెట్టాడు. అందుకే రవితేజ డైరెక్టర్ల హీరో అయ్యాడు. ప్రతి హీరో అభిమాని రవితేజ సినిమా అంటే ఖచ్చితంగా చూస్తారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పేరున్న హీరోగా రవితేజ గుర్తింపు ఉంది. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్, నాగార్జున పవన్ కళ్యాణ్ ల తర్వాత మంచి స్టార్ డమ్ ను సంపాదించిన హీరోగా రవితేజ గుర్తింపు పొందాడు. ఇటీవల రిలీజైన ధమాకా మూవీ 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద అతని స్టామీనా ఏంటో మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం రవితేజతో కలిసి పనిచేసిన డైరెక్టర్లు టాలీవుడ్ ను శాసించే స్థాయికి దిగారు. అందులో బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బాబీ, హరీష్ శంకర్ లు ఉన్నారు. వీరితోపాటు పూరి జగన్నాథ్, కృష్ణవంశీ వంటి స్టార్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బాబీ మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ సంక్రాంతి పండుగకు రిలీజ్ లు చేసినవి కావడం విశేషం. నందమూరి బాలకృష్ణ తో వీర సింహారెడ్డి మూవీని గోపీచంద్ డైరెక్ట్ చేస్తుండగా, మెగాస్టార్ చిరంజీవితో వాల్తేర్ వీరయ్య మూవీ ని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక బోయపాటి శ్రీను గత ఏడాది నందమూరి బాలకృష్ణతో అఖండ మూవీ చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన సినిమా భద్ర. బోయపాటి శ్రీనుకి మొదటి సినిమా.. ఈ యాక్షన్‌-ఫ్యాక్షన్‌ చిత్రం ‘అపదలో ఉన్న అమ్మాయిని ఆదుకున్న ‘భద్ర’ అనే యువకుని కథ. ఈ సినిమా మే 12, 2005న విడుదలైంది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి మరిన్ని భాషల్లో పునఃనిర్మితమైంది. డాన్ శీను 2010లో విడుదలైన డాన్ శీను చిత్రం ద్వారా గోపీచంద్ మలినేని దర్శకుడుగా పరిచయం అయ్యారు. హరీష్ శంకర్ మొదటి సినిమా షాక్ 2006 లో విడుదలైంది. ఈ సినిమా ద్వారా హరీష్ శంకర్ మంచి గుర్తింపును పొందారు. అలాగే వీరి కాంబో లో వచ్చిన మరో మూవీ మిరపకాయ్ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అలాగే ఇప్పుడు ఫామ్ లో లేకపోయినప్పటికీ శ్రీను వైట్ల తొలిచిత్ర హీరో కూడా రవితేజ అదేవిధంగా పూరి జగన్నాథ్ రవితేజ కాంబో ఎన్నో సూపర్ హిట్ మూవీలను అందించింది. 90వ దశకం నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇచ్చిన మాట ప్రకారం పూరి జగన్నాథ్ దర్శకుడు కాగానే రవితేజతో సినిమా చేశాడు. వీరి కాంబోలో వరుసగా మూడు బ్లాక్ బ్లస్టర్ హిట్లు వచ్చాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం 2001లో విడుదలయి అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తర్వాత ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. అలాగే కృష్ణవంశీతో కూడా తన కెరీర్ ప్రారంభంలో రవితేజ జర్నీ చేసాడు. వీరిద్దరి కాంబోలో సింధూరం అనే మూవీ వచ్చింది. ఆ మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి రవితేజకు నటుడిగా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. అలాగే కృష్ణవంశీ తో చేసిన మరో మూవీ ఖడ్గం కూడా రవితేజకు మంచి పేరును తీసుకువచ్చింది. డైరెక్టర్లు అందరితో మంచి ర్యాపోను మెయింటైన్ చేస్తూ వస్తున్న రవితేజ వరుసగా వాళ్లకు ప్లాప్ లు వస్తే మళ్లీ వారికి అవకాశం ఇచ్చి వారి కేరీర్ ను నిలబెట్టేందుకు రవితేజ ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు రవితేజ దర్శకుల హీరో. అతని మీద పెట్టుబడి పెడితే తిరిగి రావడం ఖాయమనే నమ్మకం ఏర్పడింది. అందుకే దర్శక నిర్మాతలు రవితేజ కాల్ సీట్ల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రవితేజ దర్శకులు హడావుడి మామూలుగా లేదు..

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More