‘మిస్టర్ బచ్చన్’ మళ్ళీ మళ్ళీ చూసేలా వుంటుంది: డైరెక్టర్ హరీష్ శంకర్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించిన. మిస్టర్ బచ్చన్ విడుదల సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ హరీష్ శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
ఈ సినిమా చేయడానికి రీజనే హానెస్టీ వున్న హీరోయిజం. ఇదొక ట్రూ ఇన్సిడెంట్. 80s ప్రాంతంలో నార్త్ ఇండియాలో జరిగింది. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేసిన కథ. ఆ రోజుల్లో లక్షల రూపాయల లంచం ఇస్తామని ఆఫర్ చేసినా సరే ఓ ఆఫీసర్ ఎక్కడా లొంగలేదు. నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది.
‘రైడ్’ కి దీనికి అజయ్ దేవగన్ కి రవితేజ కి ఉన్నంత డిఫరెన్స్ వుంటుంది. రవితేజ గారికి తగ్గట్టు సినిమా వుంటుంది. మిస్టర్ బచ్చన్ మళ్ళీ మళ్ళీ చూసేలా వుంటుంది. ఖచ్చితంగా సినిమా రిపీట్ ఆడియన్స్ వచ్చేలా వుంటుంది.
హానెస్ట్ వున్న వ్యక్తుల జీవితంలో ఫన్ రోమాన్స్ లవ్ అన్నీ వుంటాయి. ఇందులో తన ప్రేమలో నిజాయితీ వుంటుంది. తను చేసిన ఫైట్ లో నిజాయితీ వుంటుంది. నిజాయితీ అనే పాయింట్ నుంచే అన్నీ వచ్చాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకటే బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. అలా చూసినప్పుడు ఆడియన్స్ కి కొంచెం స్ట్రెస్ వస్తుంది. ఇందులో అది ఎవైడ్ చేశాం. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ ఎలా వచ్చిందో మీరు చూసినప్పుడు అర్ధమైపోతుంది. మా నాన్నగారు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే నాకు సినిమా ఇష్టమని ఆయనకి అర్ధమైపోయింది. చిన్నప్పటి నుంచే తెలుగు, హిందీ లిటరేచర్, సినిమాలు అంటే ఇష్టం. జంధ్యాల గారు, బాపు రమణ గారు సినిమాల్లో మాటలు విపరీతంగా వినేవాడిని. అలాగే ఈవీవీ గారి సినిమాలకి కూడా ఎట్రాక్ట్ అయ్యాను.

కొన్ని సార్లు డైరెక్టర్ గా ఫెయిల్ అయినా నా పాటలు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు

మిస్టర్ బచ్చన్ మ్యూజిక్ అంత వన్ వీక్ లో చేశాం. వన్ వీక్ లో నాలుగు చార్ట్ బస్టర్ ట్యూన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ గా కొన్ని సార్లు ఫెయిల్ అయినా నా పాటలు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఆదిత్య మ్యూజిక్ వారు హరీష్ శంకర్ హిట్స్ అని క్యాసెట్ రిలీజ్ చేశారు. నాకు మొదటి నుంచి పాటలు చాలా ఇష్టం. గద్దల కొండ గణేష్ లో అన్ని పాటలు హిట్టు. మిక్కీ మోస్ట్ అండర్ రేటెడ్ కంపోజర్ అని నా ఫీలింగ్. మిక్కీ చాలా మితభాషి. మా ఇద్దరి కాంబినేషన్ బాగా మ్యాచ్ అయ్యింది. అలాగే చిన్నప్పటి నుంచి సాహిత్యం చాలా ఇష్టం. సినిమా చూడని రోజు వుంటుందేమో కానీ పాట వినని రోజు వుండదు. ఒక మంచి వాక్యం ఇచ్చిన స్ఫూర్తి మరేది ఇవ్వలేదు. నాకు మ్యూజిక్ ఒక థెరపీ. ముఖ్యంగా లిరిక్స్ ని చాలా శ్రద్ధగా వినడం, స్ఫూర్తి పొందడం అలవాటు. ‘మా ఊపిరి నిప్పుల ఉప్పెన.. మా ఊహల కత్తుల వంతెన'(వేటూరి) ఇలాంటి వాఖ్యలు విన్నప్పుడు గొప్ప ఎనర్జీ వస్తుంటుంది. నా పాటలు కూడా ఇలా లిరిక్స్ తో గుర్తు చేసుకోవాలనేది తాపత్రయం. ఇందులో కాసర్ల శ్యామ్, వనమాలి, భాస్కర భట్ల, సాహితీ చాలా చక్కని సాహిత్యం రాశారు.

క్యాసెట్ రోజుల కథ..

మిస్టర్ బచ్చన్ క్యాసెట్ రికార్డింగ్ సెంటర్స్ వున్న రోజులో జరిగే కథ ఇది. అప్పట్లో భాహాటంగా పోస్టర్లు పెట్టి క్యాసెట్ రికార్డ్స్ చేసేవారు. ఆ టైం ని గుర్తు చేద్దామని లిరికల్ వీడియోలో అమితాబ్ గారు, చిరంజీవి గారి పోస్టర్స్ చూపించడం జరిగింది. నేను బిహెచ్ఈల్ లో పెరిగాను. అక్కడ ఓ మంచి లవ్ స్టొరీ తీయాలని ఎప్పటినుంచో కోరిక. అయితే నాకున్న మాస్ ఇమేజ్ కి తీయడం కుదరలేదు. ఈ సినిమాలో ఆ ప్రేమ కథ కోరిక ఎంతోకొంత తీరింది. ఇందులో లవ్ స్టొరీ బ్యూటీఫుల్ గా వుంటుంది.

రవితేజ గారి పెర్ఫార్మెన్స్ కొత్త గా వుంటుంది.

ఎవరూ చూడని బ్యాగ్ డ్రాప్ లో మనం మర్చిపోయిన జ్ఞాపకాలని గుర్తు చేస్తూ, మనకి గుర్తున్న జ్ఞాపకాల్ని చూపిస్తూ, రవితేజ గారి నుంచి ఏం ఆశిస్తారో అలాంటి ఎలిమెంట్స్ తో సినిమాని తీర్చిదిద్దాం. సెకండ్ హాఫ్ లో రవితేజ గారి పెర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ చాలా కొత్తగా ఫీలౌతారు. నటుడిగా ఆయనలో ఒక కంప్లీట్ నెస్ కనిపించింది. ఐటీ ఆఫీసర్ కి సూట్ అయ్యేలా రవితేజ గారు తనని మలచుకున్నారు, రవితేజ గారికి సూట్ అయ్యేలా కథని మలుచుకున్నాం. రెండు బ్యాలెన్స్ చేశారు..


విశ్వప్రసాద్ గారు లేకపోతే ఈ గ్రాండ్ నెస్ లేదు..

విశ్వప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చేది కాదు, 15న రిలీజ్ చేసేవాళ్ళం కాదు. మార్కెట్, ఫైనాన్సియల్ ఈక్వేషన్స్ తో సంబంధం లేకుండా మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తునప్పుడు కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో బిజీ అయ్యారు. కాంపెయిన్ నుంచి రిజల్ట్ వచ్చేవరకూ ఈ సినిమా ఫినిష్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాం. రవితేజ గారు లాంటి హీరో, విశ్వప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడంతో అనుకున్న సమయానికి కంప్లీట్ అయ్యింది. 90s బ్యాక్ డ్రాప్ లో ఒక వీధిలో జిక్కీ అనే అమ్మాయి వుండాలి అన్నప్పుడు.. అ అమ్మాయికి గత సినిమాల ఇమేజ్ ఉండకూడదని కొత్త అమ్మాయిని తీసుకున్నాం. తను చాలా హార్డ్ వర్క్ చేసింది, అద్భుతంగా పెర్ఫార్ చేసిందని చెప్పుకొచ్చారు హరీష్ శంకర్.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More