సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టయాన్’లోని తన పాత్రకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయడంతో చిత్రయూనిట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ప్యాన్ ఇండియన్ రేంజ్లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్ సభ్యులు అంతా కలిసి రజినీకాంత్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు.ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయన్న సంగతి తెలిసిందే. వేట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.