అసెంబ్లీ లో ఈరోజు ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది.. వైసీపీ మాజీ నేత.. ప్రస్తుత టీడీపీ ఉండి శాసన సభ్యుడు రఘురామ కృష్ణంరాజు హాయ్ జగన్… అంటూ అసెంబ్లీలో కనిపించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ను పలకరించడమే కాకుండా ప్రతిరోజు అసెంబ్లీకి రా.. ప్రతిపక్షం లేకపోతే ఎలా? అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడటంతో వైసీపీ ఎమ్మెల్యేలు షాక్ అవ్వగా కూటమి సభ్యులు ఆసక్తి గా గమనించారు. ఆర్ ఆర్ ఆర్ అడిగిన ప్రశ్నకు అసెంబ్లీకి రెగ్యులర్ వస్తా.. మీరే చూస్తారుగా అని జగన్మోహన్రెడ్డి బదులిచ్చారు. అక్కడితో ఆగకుండా తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు విజ్ఞప్తి చెయ్యడం తో తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ మంత్రి వెళ్ళిపోయారు. రఘురామను పలకరించిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన అభినందనలు తెలిపారు.. అసెంబ్లీ లో జరిగిన ఈ సంఘటన తరువాత విలేకరులతో సందర్భాన్ని వివరించారు.. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మీరే చూస్తారుగా అని బదులిచ్చారు. వైసీపీ ఎంపీ గా వున్నప్పుడే రోజు రచ్చబండ పేరుతో సొంత పార్టీని డిఫరెంట్ గా రాగింగ్ చేసిన రఘురామ మళ్ళీ అదే రూట్ ని ఎంచుకోబోతున్నారా… అన్నది ఆయన ఇచ్చిన ‘అన్నీ తిరిగి ఇచ్చేయాలిగా ‘ అన్న సమాధానం లోనే వుందని లాబీ టాక్.