పిఠాపురం లో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు, పవన్‌కల్యాణ్ మీద తన అభిమానాన్ని, ప్రేమను మరోసారి ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. చాటుకుని తన ప్రేమ పూర్వక మద్దతు ప్రకటించారు. మీరు ఎంచుకున్న నిస్వార్థమైన మీదారిని.. ప్రజల సేవలకు మీ జీవితాన్ని అంకితం చేసిన విధానం చూసి నేను ఎప్పూడు గర్వపడుతుంటాను. మీ కుటుంబ సభ్యుడిగా, నా ప్రేమ, మద్దతు మీతో ఎప్పుడూ వుంటాయి. మీ రాజకీయ ప్రస్థానంలో మీరు కోరుకున్నవి అన్నీ సాకారం కావాలని, మీ రాజకీయ ప్రయాణం విజయకేతనం ఎగురవేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ తన సోషల్ మీడియా వేదికగా జనసేనాని పవన్‌కల్యాణ్‌కు తన మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్