ఏపీ లో ప్యాలెస్ వార్…!

వైసీపీ టీడీపీ మధ్య పార్టీ ఆఫీసుల రాజకీయం..

ఆంద్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే క్షణం కూడా ఆగకుండా ప్రక్షాళన ప్రారంభించింది.. ఇంతవరకు నిషేధ ప్రాంతం గా ఉన్న ఋషికొండ లోని ప్యాలెస్ తాళాలు తీసి స్థానిక శాసనసభ్యుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రెస్ ని తీసుకెళ్లి మరి ప్యాలెస్ ని ప్రపంచానికి చూపించడం దగ్గరనుంచి ప్యాలెస్ వార్ ఎక్స్ వేదికగా మొదలైంది.. నిర్మాణాన్ని అత్యంత రహస్యం గా ఉంచిన అప్పటి ప్రభుత్వం అసలు అది ఎందుకు కడుతున్నారో కూడా చెప్పకుండా ఋషికొండ దరిదాపులలోకి ఏవ్వరూ రాకుండా జాగ్రత్త పడింది.. ఇప్పుడు ఏడు బ్లాకులున్న ఆ ప్యాలెస్ లోని విశేషాలు అందరికి తెలియడం తో అది విశాఖ కు వచ్చే రాష్ట్రపతి, ప్రధాని వంటి విశిష్ట అతిధుల కోసం నిర్మించిందని సమర్ధించుకొచ్చింది..

దాని వేడి అలా వుండగానే తాడేపల్లి లోని వైసీపీ కార్యాలయ నిర్మాణం ఇష్యు అయి కూర్చుంది.. అన్ని జిల్లాల్లోని ఇంత వరకు ఎవరికి కనిపించని వైసీపీ కార్యాలయ నిర్మాణాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి.. పేదలకు ఇల్లు ఇవ్వడానికి 48 గజాలు చాలన్న అప్పటి సీఎం 480 గజాల్లో బాత్రూం నిర్మించుకోవడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా… ప్రభుత్వ స్థలాలలోనూ, ప్రభుత్వ అనుబంధ సంస్థల స్థలాలలోనూ.. రెండేసి ఎకరాలు 33 సంవత్సరాలు లీజులు తీసుకుని పెద్దపెద్ద ప్యాలెస్ నిర్మించుకుంటున్నారు అని కూటమి నేతలు విమర్శలు మొదలు పెట్టారు. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే…దానికి నిబంధనలు పాటించలేదని కార్పొరేషన్ అధికారులు గునపాలతో వెంటపడతారు మరి వైసీపీ కార్యాలయాలులో ఇంత అక్రమాలు జరుగుతుంటే…అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.. ఇదిలా ఉండగా వైసీపీ నేతలు మావి ప్యాలెస్ లైతే.. మీవి గుడిసెలా..? కౌంటర్లేస్తున్నారు. వరుసపెట్టి వివిధ జిల్లాల్లో ఉన్న టీడీపీ కార్యాలయ ఫోటో లను ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ ఇవి లీజు స్థలాలు కావా..? అని ప్రశ్నిస్తోంది..

గతంలో వైసీపీ అధికారంలో వున్నప్పుడు విశాఖ టీడీపీ కార్యాలయం అక్రమ నిర్మాణమని దాడి చేసిన సంగతి గుర్తు చేస్తూ దసపల్లా కొండలను తొలగించి ఈ నిర్మాణం జరిగిందని పోస్ట్ చేసింది. ఇలా తమ పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై టీడీపీ కూటమి నేతలు చేస్తున్న ప్రచారాన్ని ట్విట్టర్(ఎక్స్)లో వైసీపీ తిప్పికొడు తుంది.
మీరు చేస్తే రాజకీయం.. మేము చేస్తే కబ్జానా?. హైదరాబాద్లో పాతికేళ్ల క్రితం ఎన్టీఆర్ భవన్కి ఇలానే స్థలాన్ని కేటాయించుకున్న విషయం మీ చంద్రబాబు మర్చిపోయాడా? అదే పని వైయస్ఆర్సీపీ చేస్తే కబ్జా అంటూ టీడీపీ, ఎల్లో మీడియాలో రెండు రోజులుగా ఈ కపట నాటకాలెందుకు?
అని ట్వీట్ చేసింది… వైసీపీ కి చెందిన ఒకరిద్దరు ముఖ్య నేతలు మినహా ఎవరూ ఈ ఇష్యు పై పెద్దగా మాట్లాడకపోయినప్పటికి వార్ కొనసాగుతూనే ఉంది. అక్రమ నిర్మాణాలపై ఊరుకునేది లేదని టీడీపీ నేతలు చెప్తుంటే. మీ కార్యాలయాలు సక్రమ నిర్మాణాల అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ప్రజెంట్ కొనసాగుతున్న ఈ ప్యాలెస్ వార్ అయితే ఇప్పట్లో చల్లారేల కనిపించడం లేదు.. టీడీపీ ప్రభుత్వం ఇంకొద్దిగా ముందుకెళ్ళి నిర్మాణాలపై చట్ట పరమైన చర్యలకు ఉపక్రమిస్తే వార్ మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో ప్యాలెస్ తరహా లో ఒకే ఆర్కిటెక్చర్ తో కార్యాలయాల నిర్మాణం జరుగుతూ ఉంటే ఎల్లో మీడియా గా గుర్తింపు పొందిన వారు కూడా గుర్తించి నిర్మాణాల గురించి గతం లో ప్రస్తావించకపోవడం కొసమెరుపు..

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More