ఏపీ లో ఎన్నికల ఫలితాలు ఎంత వేడి పుట్టిస్తున్నాయో.. ఆరుదశల పోలింగ్ ముగిశాక దేశంలో కూడా అంతే హడావిడి మొదలైంది.. బీజేపీ భావిస్తున్నంత ఈజీ గెలుపు సాధ్యం కాకపోవచ్చన్న సంకేతాలు మెల్లమెల్లగా రావడం తో బీజేపీ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. 272 మ్యాజిక్ ఫిగర్ బీజేపీ సొంతం గా సాధించని తరుణంలో అధికారంలోకి రాడానికి మళ్ళి ఎన్ డీ ఏ (NDA) పక్షాలను ఏకం చెయ్యాల్సిన అవసరం చాలా ఉంది. ఆ భాధ్యత ఎవరు తీసుకుంటారు… ఎవరు తీసుకుంటే మిగిలిన పక్షాలు మాట వినే పరిస్థితి వుంటుంది అన్న దానిపై చర్చలు మొదలయ్యాయి.. బీజేపీ తరువాత చెప్పుకోదగ్గ స్థాయి లో నిజం చెప్పాలంటే రెండవ హోదాలో తెలుగుదేశం పార్టీ నిలవబోతుంది.. పాత మిత్రపక్షాలన్నీ దూరమైన టైం లో బీజేపీ తర్వాత17 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుండగా 16 స్థానాల్లో నితీష్ పార్టీ పోటీ చేస్తుంది.. ఇప్పటి వరకు వచ్చిన దాదాపు సర్వే లన్నీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం ఖాయం అన్న సంకేతాలు ఇస్తున్న సమయంలో ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ గణనీయంగా ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండడంతో ఎన్ డీ ఏ కూటమి లో రెండవ అతిపెద్ద పార్టీ టీడీపీ కానుంది.. మిగిలిన పక్షాలేవి పెద్దగా పెర్ఫార్మ్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇండియా కూటమి కూడా గణనీయంగా పోటా పోటీ ఫలితాలు సాధించే అవకాశం ఉందని కొన్ని అత్యుత్తమ సర్వే సంస్థలు ప్రకటించడం తో ఎన్ డీ ఏ లో అంతర్మథనం మొదలైంది.. కూటమి లో వుండే పక్షాలను, పాత మిత్రులను ఒకటిగా చేసే పర్సన్ కన్వీనర్ గా ఉండాలని భావిస్తోంది.. ఆ పదవి కి అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు మాత్రమే సమర్ధుడని భావిస్తున్నట్లు ఢిల్లీ సమాచారం. ప్రాంతీయ పార్టీ లకు ఢిల్లీ లో నేషనల్ ఫ్రంట్ ద్వారా అధికారం కట్టబెట్టిన ఘనత ఎన్టీఆర్ ది ఆ తరువాత యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ కన్వీనర్ గా అన్ని పార్టీ లను ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన చంద్రబాబుదే అన్న అంశం దృష్టిలో ఉంచుకుని ఆయానైతేనేపాత మిత్రులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.