సంచలన విజయాలుఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం పట్ల శుభాకాంక్షలు ఏపీలో టీడీపీ కూటమి సునామీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన ఏపీలో అద్భుత విజయాలు సాధిస్తుండడం పట్ల మోదీ… చంద్రబాబుపై అభినందల వర్షం కురిపించారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం పట్ల చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి అభినందించారు. మరిన్ని లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి క్లీన్‌స్వీప్ దిశగా కొనసాగుతుండడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం అంశంపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న 11.53 నిముషాలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, వైసీపీ గెలుస్తుందని తొమ్మిదో తేదిన విశాఖలో జగన్ ప్రమణస్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ గెలుస్తుందని.. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణం చేస్తారని ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తూ వచ్చారు.