బొత్స ఓటమి కి కూటమి కుట్ర…?

వైనాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన వైసిపి ని ఏపీ ప్రజలు కేవలం 11కే పరిమితం చేసి కూర్చోబెట్టారు. ఇటు మండలి లో అటు రాజ్యసభలో సంఖ్యా బలం వుండడం తో రాష్ట్రం లోనూ కేంద్రం లోనూ తమ మద్దతు లేకుండా ఏ బిల్లు పాస్ అవ్వదన్న ధీమా ప్రదర్శిస్తున్న వైసిపి మండలికి సరైన నాయకుడ్ని పంపాలని ప్లాన్ చేస్తుంటే టిడిపి నేతృత్వం లోని కూటమి ఆ ప్లాన్ నీ డిస్ట్రాయి చెయ్యాలని ఎత్తువేస్తుంది.. వైసిపి వాళ్ళ భాషలో చెప్పాలంటే బొత్స ఓటమికి కూటమి కుట్ర చేస్తుంది.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ని తిరిగి వైసిపి అతి సునాయాసంగా దక్కించుకునే అవకాశం ఉన్నా ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలతో ఆ పార్టీ అంత ధీమా గా లేదు. మొత్తం 841మంది ఓటర్లు వుంటే వైయస్సార్సీపి 615 కి కూటమికి 215 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు వున్నారు.
ఫ్యాన్ గుర్తు తో గెలిచిన ప్రజా ప్రతినిధులను కూటమి లాగేసుకున్నా మా ప్రణాళిక మాకుందంటూ వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% ఓటింగ్ మాకున్నా…వాళ్ళు అభ్యర్థులను నిలబెడుతున్నారంటే….వాళ్ల ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు అర్థం అవుతుందని వైసీపీ విలువలు తో కూడిన రాజకీయాలు చేస్తుందని చెప్పుకొచ్చారు.. ఇదిలా వుంటే రోజురోజుకి కూటమి లోకొస్తున్న నేతల సంఖ్య పెరగడం తో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ని దక్కించుకునే అవకాశాలు ఎక్కువ గా వున్నాయని భావిస్తున్న బొత్సను ఓడించేందుకు స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో నిర్వహించిన కీలక భేటీకిఅయ్యన్న పాత్రుడు, సీఎం రమేష్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది వైసిపి ప్రజా ప్రతినిధులు కూడా హాజరైనట్టు సమాచారం. మిగిలిన అరకు, పాడేరు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లపై ఫోకస్ పెట్టాలని కూడా భావిస్తున్నారు.ఇప్పటికే కూటమి కి సపోర్ట్ చేసిన వారిని అమరావతి లో 25 రోజుల పాటు క్యాంపు ను కొనసాగించనున్నట్టు తెలిసింది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కి అనకాపల్లి టికెట్ కేటాయించడంతో సర్ధుబాట్లలో సీటు కోల్పోయిన పీల గోవింద్ కి ఎమ్మెల్సీ టిక్కెట్ కూటమి తరఫున కేటాయిస్తారని నిన్నటి వరకు వినిపించినా నిన్నటి వరకు పీలా గోవింద్ పేరు.. ఇప్పుడు బైరా దిలీప్.. పేరు కొత్త గా వినిపిస్తోంది. టీడీపీ తరపున బైరా దిలీప్చక్రవర్తిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దిలీప్ అభ్యర్థిత్వానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మద్దతు వుందని వినిపిస్తోంది.. గత పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ను దిలీప్ కు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎవరు అభ్యర్థి అన్నది అధికారికంగా ఖరారు కాకపోయినా వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి విజయం తధ్యమని సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ల నుంచి క్రాస్ ఓటింగ్ జరగడం తో ధీమా మరింత పెరిగింది. భవిష్యత్తు లో మేయర్ స్థానం కూడా కూటమి కైవసం చేసుకుంటుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలలో ఘోర ఓటమి తరువాత అస్సలు బయటకే రాలేకపోతున్న వైసిపి నేతలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక విషమ పరీక్ష గా మారగా మాజీ మంత్రి బొత్స కి మాత్రం ఈ ఎన్నిక తన రాజకీయ జీవితానికే కీలక పరీక్ష కానుందన్నది ఇన్సైడ్ టాక్ ఈజీ గెలుపు నుంచి గెలుస్తామా…? అన్న టెన్షన్ లో వైసిపి నేతలు వున్నారు . 30న పోలింగ్ జరిగితే సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More