‘మిస్టర్ బచ్చన్’ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు -హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే

మిస్టర్ బచ్చన్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేసేలా వుంటుందని కథానాయక భాగ్యశ్రీ బోర్సే చెప్పారు.
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మాణంలో రాబోతున్న ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.


బచ్చన్ లో పాత్ర పేరు జిక్కీ తెలుగు మార్వాడి గర్ల్. క్యూట్, అండ్ లవబుల్. డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ ని చాలా బ్యూటీఫుల్ గా తీర్చిదిద్దారు. బచ్చన్ లైఫ్ లో జిక్కీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో క్యాసెట్ రికార్డింగ్ షాప్ లో ఓ సీన్ వుంటుంది. ఆ సీన్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు.. ‘ఐయాం ప్రౌడ్ అఫ్ యూ’ అన్నారు. అది నాకు ఎప్పటికి గుర్తుండిపోతుందన్నారు.


నేను ఏదైనా చేసినప్పుడు హండ్రెడ్ పెర్సెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా వుంటాను. రవితేజ గారితో వర్క్ చేయడం చాలా ఎక్సయిటింగా అనిపించింది. రవితేజ గారు ఛార్మింగ్ పర్సనాలిటీ అని చెప్పారు మాది ఔరంగాబాద్, మహారాష్ట్ర. మా నాన్నగారు ఉద్యోగ రిత్యా లాగోస్(నైజీరియా) షిఫ్ట్ అయ్యారు. అక్కడే నా స్కూలింగ్ జరిగింది. బిజినెస్ మ్యానెజ్మెంట్ కోసం ముంబై వచ్చాను. గ్రాడ్యువేషన్ లో ఉండగా చాలా మంది మోడలింగ్ చేయమని ప్రోత్సహించారు. ఆ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన తర్వాత చాలా నచ్చింది. కెమరా భయం పోయింది. కొన్ని కమర్షియల్స్ చేశాను.
ఇది నా మొదటి తెలుగు సినిమా. నా వాయిస్ ఐతే ఆడియన్స్ మరింత రిలేట్ చేసుకుంటారని డైరెక్టర్ గారిని కోరాను. తెలుగు డబ్బింగ్ చెప్పడం మొదట్లో కాస్త డిఫికల్ట్ అనిపించింది. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్, టీం చాలా సపోర్ట్ చేసింది. దాదాపు వారం రోజుల్లో డబ్బింగ్ ఫినిష్ చేశాను. చాలా బావొచ్చింది. నేను నార్త్ అమ్మాయిని. తెలుగు భాషని మొదట్లో అర్ధం చేసుకోవడం కాస్త కష్టం అనిపించింది. ప్రతి డైలాగ్ ని నా మాత్రుభాషకి ట్రాన్స్ లేట్ చేసుకొని అర్ధం చేసుకున్నాను. అయితే కొద్దిరోజుల తర్వాత భాషపై పట్టు సాధించాను. తర్వాత అంత ఈజీ అయ్యింది. తెలుగు భాష చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానన్నారు.
రవితేజ గారు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఇప్పటికీ ఆయన న్యూకమ్మర్ లానే వుంటారు. సెట్ లో టైంకి వుంటారు. ఎవరికీ ట్రబుల్ ఇవ్వరు. అందరినీ కేరింగ్ గా చూసుకుంటారు. మనం ఏ స్టేజ్ వున్నా మన క్రాఫ్ట్ కి గౌరవం ఇవ్వాలని ఆయన్ని చూసి నేర్చుకున్నానని భాగ్యశ్రీ చెప్పారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More