మలయాళ ఇండస్ట్రీలోకి లైకా ప్రొడక్ష‌న్స్ లూసిఫర్ కి సీక్వెల్ గా L2 ఎంపురాన్ నిర్మాణం.

తొలిసారి గా మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలోకి లైకా ప్రొడ‌క్ష‌న్స్ L2 ఎంపురాన్’ పేరుతో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా ఓ భారీ బ‌డ్జెట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ద‌క్షిణాదిలో టాప్ యాక్ట‌ర్స్‌తో క‌లిసి ఓ కొత్త సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతుండ‌టం విశేషం.2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ రూపొందుతుంది. తొలి భాగం హిట్ కావ‌టంతో సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో ముందుగానే అంచ‌నా వేసిన మేక‌ర్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నాయి. మోహ‌న్ లాల్‌, వెర్స‌టైల్ యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రానున్న మూడో చిత్రం కావ‌టంతో అభిమానుల్లో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎగ్జ‌యిట్‌మెంట్ ఇప్ప‌టి నుంచే మొద‌లైంది.మోహ‌న్‌లాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్ర‌మ్‌గా సూప‌ర్‌స్టార్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ‘L2 ఎంపురాన్’ విష‌యానికి వ‌స్తే ఆ పాత్ర‌ను మ‌రింత విస్తృతంగా ఆవిష్క‌రించ‌బోతున్నారు. స్టీఫెన్ నెడుంప‌ల్లి అస‌లు ఖురేషి అబ్ర‌మ్‌గా ఎలా మారాడ‌నే విష‌యాన్ని ఇందులో చూపించ‌బోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పృథ్వీరాజ్ సుకుమార్ మోహ‌న్‌లాల్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ ‘L2 ఎంపురాన్’ స్టైలిష్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. హ్యాపీ బ‌ర్త్ డే లాలెట్టా అంటూ మోహ‌న్ లాల్‌పై త‌న ప్రేమాభిమానాల‌ను పోస్ట‌ర్ ద్వారా వ్య‌క్తం చేశారు పృథ్వీరాజ్‌.లూసిఫ‌ర్ మూవీలో తెల్ల‌టి చొక్కా, పంచె ధ‌రించే మోహన్ లాల్ ఖురేషి అబ్ర‌మ్ పాత్ర‌లో మోహ‌న్ లాల్ న‌ల్ల‌టి దుస్తుల‌ను ధ‌రించి కనిపిస్తున్నారు.ఈ చిత్రంలో టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్య‌ప్ప‌న్ త‌దిత‌రులు మ‌రోసారి వారి పాత్ర‌ల‌తో మెప్పించ‌బోతున్నారు.లడఖ్, చెన్నై, కొట్టాయం, యుఎస్ మరియు యుకెతో సహా ప‌లు చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. టీమ్ ప్రస్తుతం తిరువనంతపురంలో షూటింగ్ జరుపుకుంటోంది. త్వ‌ర‌లోనే గుజరాత్, యుఎఇకి కూడా టీమ్ వెళ్లనుంది.2025లో మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More