‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ విడుదలైంది

ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మాణంలో సూర్య హీరోగా దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో దర్శకుడు శివ రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.


వెయ్యిళ్ల కిందట ఐదు తెగల మధ్య సాగే పోరాటం నేపథ్యంగా, ఓటమి ఎరుగని ధీరుడైన నాయకుడు కంగువను ఒకవైపు, ప్రస్తుత కాలంలోని స్టైలిష్ హీరోను మరోవైపు చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. వెయ్యేళ్ల కిందట కంగువ చేసిన ప్రామిస్ ఏంటి, ఆ మాటను ఈనాటి కథానాయకుడు ఎలా నిలబెట్టాడు అనేది ఆసక్తికరంగా చూపిస్తూ ట్రైలర్ సాగింది. ఒక వీరుడి ప్రతిజ్ఞ ఏంటి ?, అతన్ని మోసం చేసిందెవరు ?, ఆ వీరుడు పునర్జన్మ ఎత్తాడా ?, అతను నిలబెట్టిన గౌరవం ఎలాంటిది ? అనే అంశాలతో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. వెయ్యేళ్ల కిందటి కంగువ ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేశారో, అంతే అల్ట్రా మోడరన్ గా నేటి కథనాయకుడి ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఈ రెండు పాత్రల్లో సూర్య నట విశ్వరూపం కనిపించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘ధీర ధీర కదన విహార..ధీర.’ పాట బీజీఎం “కంగువ” ట్రైలర్ ఇంటెన్సిటీ పెంచింది. “కంగువ” సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేలా ఈ రిలీజ్ ట్రైలర్ ఉండి ఆకట్టుకుంటోంది.

Related posts

థియేటర్ల లోకి‘ 4కె పతివ్రతలు’

ఇరాన్ నోట ‘భగవంత్ కేసరి’ మాట

నానికి అనుమతి నిరాకరణ…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More