ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు గా నందమూరి కళ్యాణ్ రామ్ #NKR21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ తాజాగా పూర్తయింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని ఈ క్రూషియల్ పార్ట్ హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ముప్పై రోజుల పాటు చిత్రీకరించారు. ఈ కీలక సన్నివేశానికి అవసరమైన డ్రమటిక్, లీనమయ్యే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేకర్స్ ఒక్క క్లైమాక్స్‌కే రూ. 8 కోట్లు ఖర్చు చేశారు. ఇది ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్లో హయ్యస్ట్ ఖర్చు పెట్టిన క్లైమాక్స్. ఇది గ్రాండియర్, హ్యూజ్ స్కేల్ లో వుండబోతోంది. అద్భుతమైన సెట్స్ రూపొందించడంలో పేరున్న బ్రహ్మ కడలి ఈ మ్యాసీవ్ సెట్ డిజైన్ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీని రామకృష్ణ పర్యవేక్షించారు. యాక్షన్ సన్నివేశాలు, స్టంట్లు బ్రెత్ టేకింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి.
క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ప్రముఖ తారాగణం తో పాటు దాదాపు 1000 మంది ఆర్టిస్టులు షూటింగ్లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ఫైనాన్సియల్, క్రియేటివ్ సోర్స్ లో గ్రేట్ ఇన్వెస్ట్ మెంట్ సూచిస్తోంది. సినిమా నెరేటివ్ లో ఈ పార్ట్ హైలైట్ గా వుండబోతోంది. విజయశాంతి IPS ఆఫీసర్‌గా కమాండింగ్ క్యారెక్టర్ లో తన డైనమిక్ ప్రెజెన్స్ తో ఆకట్టుకోనున్నారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్న ఈ చిత్రానికి రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.