వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నగరి లో భారీ ఓటమి తరువాత ఎక్స్ వేదికగా ఇన్నాళ్ళకి స్పందించారు.చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల!కానీ.. మంచి చేసి ఓడిపోయాం!గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!ఇంత కాలం తరువాత చెప్పాలనిపించిన మంచి ఇప్పుడు వైరల్ గా మారింది. రోజా 2014, 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా గత ప్రభుత్వం లో హయాంలో చివరి రెండున్నరేళ్లు ఆమెకు మంత్రి పదవిని నిర్వహించారు.టీడీపీపై ఆ పార్టీ నాయకులపై నోరు పారేసుకుని అన్ని మీడియాల్లోనూ దుమ్ము దులిపేసిన రోజక్క అయితే..ఈ 45 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.కౌంటింగ్ రోజు ఓటమి ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాకుండానే సైడయిపోయిన ఆమె మళ్లీ ఏ మీడియా లోను దర్శనం ఇవ్వలేదు సరికదా ఫలితాలపై ఎక్కడా రెస్పాన్డ్ అవ్వలేదు ఆమెపై ఎన్ని మీమ్స్ వైరల్ అయినా సైలెంట్ గానే వున్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎమ్మెల్సీ లకు దిశా నిర్ధేశనం చేశారో ఆదైర్యం ముందుకొచ్చినట్లు అనిపిస్తుంది.. శాప్ అవకతవకలపై బైరెడ్డి పై అప్పటి మంత్రి రోజా పై దర్యాప్తు వార్త బయటకు రాగానే ఈ ట్వీట్ రావడం కూడా ఆత్మ రక్షణ చర్యలో భాగమే నంటున్నారు.. పొయిటిక్ గా రాసుకొచ్చి ఓ ఫోటో కూడా జత చేసిన రోజా కామెంట్స్ సెక్షన్ ని మాత్రం ఆపేయడం కొసమెరుపు. అయితే నెటిజన్లు ఊరుకోకుండా మంచి చేస్తే చెప్పడానికి ఇంత టైమ్ పట్టిందా రోజక్క అని వేరే మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు.