ప్రీ లాంచ్ ఈవెంట్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ దర్శకత్వంలో విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన జీ5(ZEE5) ఒరిజినల్ సిరీస్ ‘పరువు’. జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానున్న నేపద్యంలో ‘పరువు’ ప్రీ లాంచ్ ఈవెంట్‌ను గురువారం నిర్వహించారు. ఇందులో మొదటి ఎపిసోడ్‌ను అందరికీ చూపించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో..చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘పరువు’ పైలెట్ ఎపిసోడ్ బాగుంది. థియేటర్ అయినా, ఓటీటీ అయినా కూడా ఆడియెన్స్ మంచి కాన్సెప్ట్‌లతో వస్తే ఆదరిస్తుంటారు. నేషనల్ వైడ్‌గా అందరినీ ఆకట్టుకునేలా ఈ పరువు వెబ్ సిరీస్ రాబోతోందని చెప్పారు.. ఫస్ట్ ఎపిసోడ్ చూసినంత సేపు టైం తెలియలేదు. అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంది. విప్లవ్ ఎడిటింగ్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్, కెమెరా వర్క్ అదిరిపోయింది. సిరీస్ అంతా కూడా ఎంతో సహజంగా కనిపించింది. షో రైటర్, డైరెక్టర్లకు కంగ్రాట్స్. షో రన్నర్ పవన్ సాధినేని అద్భుతమైన దర్శకులు. పవన్‌కు కంగ్రాట్స్. ఏ ఒక్కరు కూడా కొత్త యాక్టర్‌గా అనిపించలేదు. నరేష్ అగస్త్య అద్భుతంగా నటించారు. ఆయన విలక్షణ నటుడు. నివేదా ఎప్పుడూ డిఫరెంట్ పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్నారు. మా నాన్నని ఈ పోస్టర్లో చూస్తే నాకే భయం వేసింది. నేను మా హనీ అక్క కోసం ఇక్కడికి వచ్చాను. అక్క ఎప్పుడూ మా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుని అవకాశాలు అడగలేదు. సొంతంగా బిల్డ్ చేసుకుంటోంది. మా అక్కని చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుంది. ఈ సిరీస్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.నిర్మాతల్లో ఒకరైన సుష్మిత కొణిదెల మాట్లాడుతూ.. ‘మా ప్రతీ ప్రాజెక్ట్‌కు మీడియా ఎంతో సహకరిస్తోంది. జీ5 టీం మాకు ఎంతో అండగా నిలబడుతోంది. ఇది చాలా సున్నితమైన అంశం. సమాజంలో ఇంకా ఈ అంశం గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. పరువు హత్యల వల్ల బాధపడుతున్న వారి గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే సిద్దార్థ్, రాజ్ అద్భుతంగా ఈ స్క్రిప్ట్ రాశారు. ఎన్నో లేయర్స్, ఎన్నో కారెక్టర్లతో పరువు స్క్రిప్ట్‌ను అద్భుతంగా రాశారు. ప్రతీ ఎపిసోడ్‌కు ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉందన్నారు.దర్శక, రచయితలు సిద్దార్థ్ నాయుడు , వడ్లపాటి రాజశేఖర్ రచయిత బీవీఎస్ రవి .ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య పొట్ల ,నటుడు నరేష్ అగస్త్య నటి నివేదా పేతురాజ్ జీ5 వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ దేశ్రాయ్ తదితరులు ప్రసంగించారు.