ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలుగా శివ పాలడుగు దర్శకత్వం లోఅజయ్ ఘోష్, చాందినీ చౌదరి నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ మనసుతో ఇష్టంతో, ప్రేమతో ఈ సినిమాను దర్శకుడు తీశాడని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. చాందినీ చౌదరి కి ఈ చిత్రంతో మంచి బ్రేక్ రావాలని అలాగే ఎలాంటి పాత్రైనా అవలీలగా నటించ గలిగే అజయ్ ఘోష్ ఈ టీంకు మంచి బ్రేక్ రావాలి. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి’ అని ఆకాంక్షించారు.ఇందులో కీలక పాత్ర పోషించిన అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. టాలెంట్‌ను గుర్తించి, భుజం తట్టే వాళ్లు నడిపించే వాళ్లు లేకపోతే ముందుకు వెళ్లలేం. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఏం అవ్వాలనుకున్నామో.. ఏం అయ్యామో.. ఏమై మిగిలిపోయామో.. ఈ సినిమా చూసిన తరువాత తెలుస్తుంది. ఈ మూవీ చూసి ఆనందపడతారు. కుమిలిపోతారు. మ్యూజిక్ షాప్ మూర్తి ప్రోమోస్ లో మూర్తి, అంజన పాత్రలు, వాళ్ల చుట్టూ ఉన్న సమాజాన్ని అందరూ చూసి ఉంటారు.. ప్రతీ పాత్రతో ఎక్కడోచోట ఎవరోకరు కనెక్ట్ అవుతారు. ఇది సినిమా కాదు.. జీవితం. ఈ సినిమా చూసిన తరువాత ఎవరైనా ఏదైనా సాధిస్తారు. నాలో ఏం చూశాడో కానీ.. నేను ఈ పాత్ర చేయాలని రెండున్నరేళ్లు ఎదురుచూశాడు. నేను కూడా మూర్తి కంటే ఎక్కువ కష్టాలు ఈ ఇండస్ట్రీలో పడ్డాను. ఈ ప్రయాణంలో నా భార్య నాకు ఎంతో అండగా నిలబడింది. ప్రతీ కుటుంబం చూడాల్సిన సినిమా. అన్ని వర్గాల వారికి ఈ చిత్రం నచ్చుతుంది. వంద కోట్లు పెట్టి తీసినా చూస్తారు.. కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా చూసి సక్సెస్ చేస్తారు. తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్లు. ఈ చిత్రం ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. జూన్ 14న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ.. ప్రతీ మనిషికి ఆశలు, ఆశయాలుంటాయి. కొన్ని చిన్నప్పుడే తెలుస్తాయి. కొన్ని రియాల్టీకి దగ్గరగా ఉంటాయి. ఇంకొన్ని రియాల్టీకి దూరంగా ఉంటాయి. అలాంటి ఆశలు, ఆశయాలతో ఉండే ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. కల కనడానికి ఓ వయసంటూ ఉండదు. సమాజంలో ప్రతీ ఒక్క దానికి ఏజ్ లిమిట్ పెడతారు. నిరుత్సాహ పర్చే వారే ఎక్కువగా ఉంటారు. చాలా మంది కాంప్రమైజ్ అవుతారు. ఓ లక్ష్యం, కల కనడానికి వయసుతో సంబంధం లేదని చెప్పడమే మా సినిమా ఉద్దేశం. పది, పన్నెండేళ్ల క్రితం నేను హీరోయిన్ అవుదామని అనుకున్నా. చాలా మంది నవ్వారు. నేను కూడా నవ్వుకున్న రోజులున్నాయి. కానీ కట్ చేస్తే.. ఒకే రోజు నా రెండు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. వంద మంది ఈ మూవీని చూసి మూర్తిలా ఒక్కరు ఆలోచించినా మాకు విజయం వచ్చినట్టే. జూన్ 14న మా చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడండి. అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు.ధీరజ్ మొగిలినేని శివ పాలడుగు, హర్ష గారపాటి మ్యూజిక్ డైరెక్టర్ పవన్ కెమెరామెన్ శ్రీనివాస్ ఎడిటర్ నాగేశ్వర్ ,నటుడు దయానంద్ తదితరులు మాట్లాడారు