సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనాన టిక్కెట్లు ఈ నెల18 నుంచి 25వ తేదీ వరకు వివిధ కేటగిరీలలో విడుదల చేయనున్నారు.. సుప్రభాతం మరియు ఇతర ముఖ్య సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌లు 18 వ తేదీ ఉదయం10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. 20వ తేదీ10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి డ్రా తీసి దర్శనాన్ని కన్ఫర్మ్ చేస్తారు. ఎన్నికైన భక్తులు దర్శన రుసుము చెల్లించి సేవను పొందవచ్చు. అలాగే కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు 21వ తేదీ 10 గంటల నుంచిఆన్‌లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్) మరియు శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవాల దర్శన కోటా బుకింగ్ కోసం అదేరోజు సాయంత్రం 3 నుంచి అందుబాటులో ఉంటాయి. అదే విధంగా అంగప్రదక్షిణం టోకెన్లు బుకింగ్ 22 వ తేదీ ఉదయం పది గంటలకి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం మరియు వసతి కోటా టిక్కెట్లు అదేరోజు ఉదయం11 గంటలకి అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్లు మరియు హెల్త్ ఇష్యూ లు ఉన్నవారి టిక్కెట్ల బుకింగ్ 22వ తేదీ 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను 24వ తేదీ ఉదయం 10 గంటలకి విడుదల చేస్తారు. తిరుమల మరియు తిరుపతిలో కాటేజీ లు 24 వ తేదీ 3గంటలకి అందుబాటులో ఉంటాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు 200 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం జూలై మాసానికి సంబంధించి టిక్కెట్లు బుకింగ్ కోసం 24వ తేదీ 10 అందుబాటులో ఉంటాయి. జూలై నెల తిరుపతి స్థానిక ఆలయాల సేవా కోటా బుకింగ్ కోసం 25 వ తేదీ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉండగాసప్తగౌ ప్రదక్షిణ శాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం, అలిపిరి జూలై నెల టిక్కెట్లు 25వ తేదీ ఉదయం 10 గంటలకు అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.