ఎన్డీఏ కి వైసీపీ అవసరం ఉందని పార్లమెంట్ లో టీడీపీకి 16 మంది ఎంపీలు ఉంటే, వైఎస్ఆర్సీపీ కి 15 ఎంపీలు ఉన్నారనికేంద్రంలో బీజేపీ కి బిల్లులు పాస్ కావాలి అంటే మా మద్దతు కూడా అనివార్యం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు.రాష్ట్రంలో ఓటమిపాలైనప్పటికీ.. పార్లమెంట్ లో మా బలం టీడీపీతో దాదాపు సమానంరాష్ట్ర, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బిల్లులపై మా నిర్ణయాలు ఉంటాయివైఎస్ఆర్సీపీ దేశభక్తి కల్గిన పార్టీ కనుక అంశాలవారీగా ప్రభుత్వానికి మద్దతు ఉంటుంది, అంతే తప్ప మా మద్దతు బీజేపీకి కాదన్నారు రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మా పార్టీపై ఉంటుంది. దానికి తగ్గట్టే మా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు.ఇది ప్రజాతీర్పు. ఆ తీర్పును అన్ని పార్టీలు అంగీకరించాలి. ఎన్డీఏ లేదా ఇండియా కూటమికి వచ్చిన ఓట్లు, సీట్లు కూడా ప్రజాతీర్పులో భాగంగానే చూస్తామనిఏపీలో ఎన్నికల్లో వైసీపీ వైఫల్యంపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామని వివరించారుచంద్రబాబు నాయుడు చేరని పార్టీ ఏది? ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప ప్రతి రాజకీయ పార్టీతో ఆయన జత కట్టారని. గతంలో కమ్యూనిస్టులతో, టిఆర్ఎస్ తో, జనసేనతో, బీజేపీతో, కాంగ్రెస్ తో.. ఇలా అన్ని పార్టీలతో ఆయన జత కట్టారని విమర్శించారు.ఏపీలో టీడీపీ చేస్తున్న అకృత్యాలను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా చేస్తున్న దాడుల గురించి చెప్పామన్నారుఅత్యంత భయానక పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయనిచంద్రబాబు పాలన ఆటవిక పరిపాలన అన్నట్టుగా ఉందనివీడియో దృశ్యాలు చూస్తేఎన్నికల సమయంలో.. ఎన్నికల తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నాయి వైఎస్ఆర్సీపీ ఎంపీలు అందరం ప్రధానికి, రాష్ట్రపతికి, హోంమంత్రికి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశామని రాష్ట్రంలో జరుగుతున్న హింసకు ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వైసీపీ ఎంపీలు హెచ్చరించారు.