ఏమయ్యాయో తెలియటం లేదు

ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయపడ్డాం. కానీ ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కి రాజీనామా చేసే ముందు జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు.. కోటి ఐదు లక్షల మంది అక్కచెల్లెళ్ల కు మేలు చేశాం అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదు. అండగా ఉన్న ఆసరా సున్నా వడ్డీతో అండగా ఉన్నం చేయూతతో తోడుగా ఉన్నాం. అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. ఎన్ని మంచి పనులు చేసిన ఆప్యాయత ఏమైందో తెలియడం లేదు. 54 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సాయం అందించాం. సమయానికి వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ మొదలుకాగానే అందించాం. రైతన్నల ప్రేమ ఏమైందో తెలియడం లేదు. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకు వచ్చాం తల్లుల పిల్లల అభిమానం ఏమైందో తెలియడం లేదు. మేనిఫెస్టో బైబిల్ గా ఖురాన్ గా భగవద్గీతగా మొట్టమొదటి రోజు నుంచి భావిస్తూ 99% వాగ్దానాలు అమలు చేసాం. ఎప్పుడూ చూడని విధంగా సచివాల వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాం విద్య వైద్య వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొస్తూ పేదవారికి అండగా నిలిచాము. సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికే చూపించగలిగాం. కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత వారి అభిమానం ఆప్యాయత ఏమైందో తెలియదు..ఎవరో మోసం చేశారు అన్యాయం చేశారు అనవచ్చు కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు చేయగలిగింది ఏమీ లేదు ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నమంచి చేయటానికి ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటా అంటూ ఓడిపోయిన కూడా ప్రతి కార్యకర్తకు నాయకుడు వాలంటీరుకు ప్రతి స్టార్ క్యాంపెనర్ కు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు కృతజ్ఞతలు తెలిపారు..గుండె ధైర్యంతో ఎక్కడి నుంచి మళ్లీ లేస్తాం ప్రతిపక్షంలో ఉండడం కోసం కాదు పోరాటాలు చేయటం అంతకన్నా కొత్త కాదనిరాజకీయ జీవితమంతా ఐదు సంవత్సరాల తప్ప ప్రతిపక్షంలోనే గడిపానని చెప్పుకొచ్చారు.రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు చూసానంటూ గద్గద స్వరం తో చెప్తూ నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియ జేశారు.. ఇదిలా ఉండగ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సమర్పించిన రాజీనామా జూన్ 4 నుండి అమల్లోకి వచ్చేలా ఆమోదిస్తూనే కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగాలని గవర్నర్ కోరారు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More