చాట్ జీపీటీకి పోటీగా ఎలన్ మస్క్ చాట్ బాట్

చాట్‌జీపీటీ ని ఓ వైపు తీవ్రంగా వ్యతిరేకిస్తునే కృత్రిమ మేధ ఆధారితం గా తమ సంస్థ నుంచి ఒక చాట్‌బాట్‌ను తీసుకురానున్నట్లు ఎలాన్ మాస్క్ ప్రకటించారు. నిజానికి కృత్రిమ మేధ తో మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని మరోసారి హెచ్చరించారు. చాట్‌జీపీటీ తరహా చాట్‌బాట్‌లు పక్షపాతంగా వ్యహరించే ప్రమాదం ఉందని ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోటీ అవసరమని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రూత్‌జీపీటీ పేరిట తాను తీసుకురాబోయే ఏఐ చాట్‌బాట్‌.. ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకుని వ్యవహరిస్తుందని తెలిపారు. ఇలా మనవాళిని అర్థం చేసుకునే ఏఐ వల్ల ఎలాంటి ముప్పు ఉండదని చెపుతూనే చాట్‌జీపీటీకి సరైన పద్ధతిలో శిక్షణనివ్వడం లేదని.. తద్వారా అది పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని ఆరోపణలు చేశారు. ఓపెన్‌ఏఐ ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు అనుబంధంగా పనిచేస్తోందన్నారు. ఇక ఆ కంపెనీ ఏమాత్రం లాభాపేక్షలేని సంస్థ కాదని అన్నారు. ఏఐని కచ్చితంగా నియంత్రించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. మొత్తం మానవాళినే నాశనం చేసే శక్తి కృత్రిమ మేధ కలిగి ఉందని హెచ్చరించారు. ఏఐ సాంకేతికత అభివృద్ధి కోసం మస్క్‌ ఎక్స్‌.ఏఐ కార్ప్‌ పేరిట ఓ సంస్థను సైతం రిజిస్ట్రేషన్‌ చేసినట్లు నెవాడా బిజినెస్‌ ఫైలింగ్‌ ద్వారా తెలుస్తోంది. దీనికి ఆయన డైరెక్టర్‌గా, ఆయన సలహాదారు జేర్డ్‌ బిర్చల్‌ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. ఏఐపై మార్క్‌ జుకర్‌బర్గ్‌, బిల్‌గేట్స్‌ వంటి టెక్‌ దిగ్గజాలతో పోలిస్తే మస్క్‌ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐలో తొలినాళ్లలో ఇన్వెస్ట్‌ చేసినవాళ్లలో మస్క్‌ కూడా ఒకరు. 2018లో దాని నుంచి ఆయన పూర్తిగా నిష్క్రమించారు. కంపెనీని నడిపిస్తున్న వారితో విభేదాలు, టెస్లాలో కొన్ని కీలక పనులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉండడం వల్లే తాను ఓపెన్‌ఏఐ నుంచి బయటకు వచ్చినట్లు వెల్లడించారు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More