దేశవ్యాప్తంగా ఏడు విడతల పోలింగ్ సందడి ప్రశాంతంగా ముగిసింది.. చివరి విడత పోలింగ్ జరిగిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవచ్చు అని అనుమతి ఇవ్వడం తో ఎప్పుడు ఎదురుచూడని వాళ్ళు కూడా జూన్ 4వ తేదీ కన్నా ముందు జూన్1 ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం ఎదురు చూశారు.. దేశవ్యాప్తంగా రానే వచ్చిన ఫలితాల వెల్లడి ని మీడియా నిస్సిగ్గు గా నిలువునా చీలిపోయి విడుదల చేసింది.. టీడీపీ అనుకూల చానల్స్ కూటమి గెలుపు ఇచ్చిన వాటినే హైలైట్ చేస్తే వైసీపీ అనుకూల మీడియా ఆ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తాయని ఇచ్చిన సంస్థల సర్వే లను మాత్రమే ప్రకటించాయి.. ఆ తెలుగుదేశం అనుకూల ఛానల్ లో ఫలితాలు ఒక లాగా వైసీపీ అనుకూల ఛానల్ లో ఒక లాగా రావడం పై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు గా పోల్స్ ని ప్రకటించే ప్రముఖ ఛానల్ ఏదైనా ఉందంటే ఒక్కటి కూడా లేకపోవడం విచారకరం.. ఏపీ లో వైసీపీ అడ్రస్ గల్లంతు అని ఒక వర్గం చానల్స్ హోరెత్తిస్తుంటే కుదేలయిన కూటమి అని మరో వర్గం చానల్స్ బ్రేకింగ్ న్యూస్ లు వేస్తున్నాయి.. ఎలక్ట్రానిక్ మీడియా అనే కాదు ప్రింట్, సోషల్, వెబ్ అన్ని మీడియా లది ఇదే దారి.. జూన్4 అయినా ఎగ్జాక్ట్ ఫలితాలు ఇస్తారా లేక ఇలాగే మీకు అనుకూల ఫలితాలు ఇస్తారా.. అని సామాన్యుడి ప్రశ్న..