ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజలంతా ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తున్న తరుణం లో ఆరోజు వెరీ వెరీ స్పెషల్ డే గా మారనుంది ఇరు వర్గాలు గెలుపు పై విపరీతమైన ధీమాను ప్రదర్శిస్తున్నారు.. ఎవరికి వారే గెలుపు అంచనాలపై ప్రదర్శనలకు ఊరేగింపులకు గట్టి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఎన్నికల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలోఎన్నికల సంఘం మరికొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఏపీలో ర్యాలీలు, ఉరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.