ఈ దశాబ్దాపు అతిపెద్ద వేడుకకు రంగం సిద్ధమైంది.. దేశం అంతా ఎన్నికలు తప్పా వేరే విషయం మాట్లాడటం లేదు.. అత్యంత ఖరీదైన ఎన్నికలకు గా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న ఈ ఎలక్షన్స్ లో ఓటేయాడానికి ప్రజలు సంసిద్ధమయ్యారు.. దాదాపు 70లక్షలకు పైగా ప్రవాసాంధ్రులు ఓటు వేయడానికి ఆంద్రప్రదేశ్ కి ప్రయాణమయ్యారు.. అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పెట్టబెడా సర్దుకుని పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు.. మరి అందరికి సెలవు రోజైన ఈ రోజు వాళ్లంత విధులు నిర్వహిస్తున్నందుకు ఎన్నికల సంఘం వేతనాలు వారికి ఎంత వేతనం ఇస్తుంది.. శిక్షణ దినాలలో పాటు పోలింగ్ రెండు రోజులు కలిపి వారికి ఇచ్చే వేతనాన్ని ఎన్నికల కమిషన్ ఖరారు చేసింది..అలాగే భోజనం ఖర్చులను అదనంగా ఇస్తున్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే వారికి అదనం గా పే చేస్తారు.ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మూడు రోజుల శిక్షణతో పాటు రెండు రోజుల పోలింగ్ దినాలు కలిపి మొత్తం ఐదు రోజులకు గాను రోజుకు రూ.600 చొప్పున ఒక్కొక్కరికి రూ.3 వేలు చెల్లిస్తారు.అదనపు పోలింగ్ అధికారికి రెండు రోజుల శిక్షణతో పాటు రెండు రోజుల పోలింగ్ దినాలు కలిపి నాలుగు రోజులకు గాను రోజుకు రూ.400 చొప్పున రూ.1600 చెల్లిస్తారు.సూక్ష్మ పరిశీలకుడికి (మైక్రో ఆబ్జర్వర్) రూ.2 వేలు, ఓటరు ఫెసిలిటీస్ సెంటర్ ఇన్‌ఛార్జికి రెండు రోజులకు గాను రూ.600 చెల్లిస్తారు.ఎన్నికల ప్రక్రియ జరిగే ఈ నెల 12, 13 తేదీల్లో పోలింగ్ స్టేషన్‌లో ఒక్కొకరికి రెండు రోజులకుగాను అల్పాహారం, భోజనానికి రూ.250, తాగునీటికి రూ.20 చొప్పున చెల్లిస్తారు. అలాగే ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో ఎన్నికల ఏర్పాట్ల కోసం పది మంది సిబ్బందికి రూ.4 వేలు నిధులను కేటాయించారు. ఇది వేతనాల అంశం అయితే వీళ్లంతారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలలో జరిగే ఓటింగ్ విధుల్లో పాల్గొంటారు. ఇందులో 12,459 సున్నితమైన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అలాగే సమస్యాత్మక సెగ్మెంట్లు 14(100% వెబ్కాస్టింగ్) మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె…కేంద్రాలు ఉన్నాయి.. మొత్తం 3.30 లక్షలు పోలింగ్ సిబ్బంది, 1.14లక్షల మంది పోలీసులు, 10,000 సెక్టార్ ఆఫీసర్స్, 8,961 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొంటారు.