ధూం దాం నుంచి మల్లెపూల టాక్సీ లిరికల్ విడుదల

లిరికల్ విడుదలచేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే తో సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్న. “ధూం ధాం” సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘మల్లెపూల టాక్సీ..’ రిలీజ్ చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..గోపీ సుందర్ క్యాచీ బీట్ తో కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ గా పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. పెళ్లి నేపథ్యంగా ఈ పాటను కలర్ పుల్ గా పిక్చరైజ్ చేశారు. ‘నూటొక్క జిల్లాల అందగాడే మా ఇంటి పిల్లకు నచ్చినాడే…ఎన్నెల్లో ముంచిన చందురుడే మా పిల్ల కోసమే పుట్టినాడే..బుగ్గ చుక్క పెట్టుకున్న అందాల చందాల బంతిరెక్క ఎరికోరి సరైనోడినే ఎంచుకున్నాదే ఎంచక్కా.. పెండ్లి పిల్ల, పిల్లగాడి జోడి అదిరెనే…ఈ ఇద్దరి జంట చూసినోళ్ల కళ్లు చెదిరెనే..నువ్వు మల్లెపూల టాక్సీ తేరే మల్లేశా..పిల్లదాన్ని అత్తింటికి తీసుకపోరా మల్లేశా..’ అంటూ సాగుతుందీ పాట సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు..

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More