దేవర యూనిట్ పై తేనెటీగల దాడి..

జూనియర్ ఆర్టిస్టులతో ఆడుకున్న ఏజెంట్లు.మన్యం జిల్లా పాడేరు లోని మొదకొండమ్మ అమ్మవారి పాదాల సమీపంలో జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ పై తేనెటీగలు దాడి చేయడంతో సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒక పెళ్లి బృందం పై దుండగులు దాడి చేయడం, జీపు బ్లాస్ట్అయి,పెళ్లి బృందం గాయాల పాలవడం వంటి సన్నివేశాలను డ్రోన్ కెమెరా తో పాటు ఇతర కెమెరాలతో చిత్రీకరిస్తున్న క్రమంలో డ్రోన్ కెమెరా అక్కడే ఉన్న చెట్ల మధ్యలో ఉన్న ఒక తేనెతుట్టకు తగలడంతో తేనెటీగలు చెదరి భారీ సంఖ్యలో అక్కడే ఉన్న చిత్ర యూనిట్ పై దాడి చేసాయి. హఠాత్పరిమానానికి భయభ్రాంతులైన ఆర్టిస్టులు తలోదిక్కుకు పరుగులెట్టారు .మహిళలు ఎక్కువగా తేనెటీగల దాడికి గాయపడ్డారు. లో వీరిలో ఇద్దరికీ ఎక్కువగా కుట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తేనెటీగల దాడికి గురైన ఆర్టిస్టులకు ప్రథమ చికిత్స పాడేరు ఆసుపత్రిలో ఇవ్వగా, కొంతమంది ఇళ్లకు వెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు .దీంతో తొలిరోజు షూటింగ్ కి అంతరాయం జరిగింది. మన్యం జిల్లాలో జరుగుతున్న దేవర సినిమా షూటింగ్ లో తేనెటీగల దాడి ఒకవైపు అయితే మరోవైపు ఏజెంట్ల కాసులు కక్కుర్తి ఆర్టిస్టులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. పెద్ద హీరో సినిమా కావడంతో కాస్టింగ్ కాల్ కు ఆర్టిస్టులు కాస్త ఎక్కువగానే స్పందించారు. ఆర్టిస్టుల భారీ స్పందనను అలుసుగా తీసుకున్న ఏజెంట్లు తీరు ఆర్టిస్టులను చాలా ఇబ్బందులకు గురిచేసింది. సోమవారం ఉదయం షూటింగ్ లొకేషన్లో ఆర్టిస్టులు ఉండాల్సి ఉందని ముందు రోజు రాత్రి 8:30 గంటలకు ఆఫీసు వద్దకు చేరుకోవాలని ఏజెంట్లు ఆర్టిస్టులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆర్టిస్టులు అందరూ నిర్ణీత సమయానికి ఏజెంట్ కార్యాలయం వద్దకు చేరుకున్నప్పటికీ రాత్రి 11 గంటల వరకు వారి ఏర్పాటు చేసిన బస్సులు రాలేదు. దాదాపు రెండున్నర గంటల తర్వాత పాటు 11 గంటలకు వచ్చిన రెండు బస్సుల్లో సుమారు 90 మందికి పైగా ఆర్టిస్టులు బస్సుల్లో బయలుదేరారు. తెల్లవారుజామున 3 గంటలకు పాడేరు చేరుకొని కనీసం రెండు గంటలైనా హోటల్ లో రిలాక్స్ అవ్వొచ్చని భావించిన ఆర్టిస్టులకు ఏజెంట్ లు హోటల్ గదులు ఏర్పాటు చేయలేదని తెలిసి ఖంగు తిన్నారు. మహిళలు, పురుషులు ,పిల్లలు ఉన్నటువంటి ఆర్టిస్టులకు ఏజెంట్లు ఎటువంటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో తెల్లవారు 6 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు ఆర్టిస్టులందరూ ఆ రోడ్లమీద వేచి ఉండాల్సివచ్చింది. ఆరు గంటలకు మళ్లీ అదే బస్సులో ఏజెంట్లు ఆర్టిస్టులందరినీ షూటింగ్ లొకేషన్స్ కి తీసుకువెళ్లారు .ముందు రోజు రాత్రి బస్సు ఎక్కిన ఆర్టిస్టులు స్నాన, పానాలు లేకుండానే షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చింది. దీంతో కాలకృత్యాలు విషయంలో మహిళలు, పిల్లలు వృద్దులు, (ఆర్టిస్టులు) చాలా ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికీ సినిమా మీద ఉన్న మక్కువతో ఆ కష్టాలను సైతం ఆర్టిస్టులు భరించారు. నీరు కూడా సరిగా అందుబాటులో లేకపోయినప్పటికీ ఇబ్బంది పడుతూనే షూటింగ్లో పాల్గొన్నారు .ఇదే క్రమంలో అనుకోని అవాంతరంగా తేనెటీగలు ఆర్టిస్టులపై దాడి చేయడంతో మూడు గంటల వరకు ఆసుపత్రిలోనూ చికిత్స పొందిన ఆర్టిస్టులకు ఆ తర్వాత అయినా సరే ఏజెంట్లు హోటల్ గదులు ఏర్పాటు చేశారా అంటే ….అది కూడా లేదు. తేనెటీగల దాడి చేయడంతో తీవ్ర అస్వస్థకు గురై , దాదాపు స్పృహ కోల్పోయిన ఆర్టిస్టులు కూడా సాయంత్రం 3:30 నుండి 9:30 గంటల వరకు అంటే దాదాపు 5 గంటల పైన మళ్లీ రోడ్లమీద పడి కాపులు కాయాల్సి వచ్చింది. హోటల్ గదులు పరిస్థితి ఏంటి అని ఏజెంట్లు నిలదీసి న ఆర్టిస్టులకు …” గదులేమీ ఖాళీ లేవు , మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం …”అన్న ఏజెంట్ సమాధానం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎందుకంటే షూటింగ్ ప్రారంభానికి ముందుగానే ఆర్టిస్టులకు సరిపడా వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఏజెంట్లు, మేనేజర్లపై ఉంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ముందు రోజు నైట్ బయలుదేరి న ఆర్టిస్టులు మరుసటి రోజు రాత్రి 9:30 గంటల వరకు ఎటువంటి వసతి సౌకర్యాలు లేకుండా అంతసేపు రోడ్లమీద పడివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీరు ఆర్టిస్టులను చులకన చేయటమే అని ఆర్టిస్టులు మేనేజర్లు, ఏజెంట్ల పై వాదనకు దిగారు .మా ప్రయత్నం మేము చేస్తున్నాం రూములు దొరకలేదు మమ్మల్ని ఏం చేయమంటారు అని.. ఏజెంట్లు చెప్పడంతో నిరాశకు గురైన ఆర్టిస్టు లు అయితే మాకు సౌకర్యాలు కల్పించ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు .మమ్మల్ని ఎలా తీసుకొచ్చారో అలాగే వైజాగ్ తీసుకు వెళ్ళండి అని చెప్పడంతో ఏజెంట్లు ఒక బస్సులో కొంతమంది ఆర్టిస్టుల్ని వైజాగ్ పంపించేశారు. ఇదిలా ఉండగా షూటింగ్ లో కమిట్ అయ్యి…మధ్యలోనే కొంతమంది ఆర్టిస్టులు వెళ్లిపోయారు …అంటూ ఆర్టిస్టులపై అబాండం …వేస్తూ తమ తప్పు …ఏమీ లేదు అంటూ ఏజెంట్లు చేతులు దులుపుకోవడం కొసమెరుపు . ఇళ్లకు బయలుదేరిన ఆర్టిస్టులు చాలామంది తేనె టీగల దాడికి గురై విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ కనీసం వారి ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ కూడా చేయలేదు. కనీసం చిత్ర యూనిట్ కైనా ఈ విషయం తెలుసో.. తెలియదో …తెలియదు గాని ఆర్టిస్టులు పట్ల ఏజెంట్లకు ఉన్న చిన్నచూపుకి విశాఖలోని పలువురు ఆర్టిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More