మోస్ట్ ఏవైటెడ్ ఫిల్మ్ ‘కల్కి 2898’AD (KALKI2898 AD)సృష్టించబోతున్న అద్భుతాలకోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. అన్ని భాషల ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.. భారతదేశపు వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అశ్వద్ధామ ఇంట్రో గ్లింప్స్.., అమితాబ్ నటన వరల్డ్ వైడ్ గా వావ్ అనిపించింది.. జూన్27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న కల్కి2898AD నుంచి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభాస్ ని విష్ణు అవతారంలో పరిచయం చేసే సన్నివేశం లో సూపర్ స్టార్ మహేష్ బాబుని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా నాగ్ అశ్విన్ అండ్ టీం సంప్రదించినట్టు సమాచారం. ఇది వాస్తవ రూపం దాలిస్తే సినిమా గ్రాఫ్ మరింత పెరగనుంది.. ఇప్పటికే అగ్రతారలు అభినయం తో దద్దరిల్లిపోనున్న స్క్రీన్స్ మహేష్ బాబు వాయిస్ తో మరింత మెస్మరైస్ చేయనున్నాయి..