రస్టిక్ అండ్ రా మూవీగా రూపొంది నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన దసరా మూవీ లోని ‘చంకీలా అంగీలేసి’ అనే పాట ఇప్పుడు రీల్స్ లోనూ ఆ తరహా ఇతర మాధ్యమాలను దుమ్ము రేపుతుంది.. థియేటర్ లలో మిక్స్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బిగ్ బ్రేక్ ఈవెన్ కోసం బరిలోకి దిగి కేవలం మూడురోజుల్లోనే దాన్ని టచ్ చేసిందని సమాచారం. సినిమాలో వచ్చే పాటను జనం అంతంత మాత్రమే మెచ్చుకున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇది పెద్ద హిట్టయి కూర్చుంది. సెలబ్రిటీల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ‘కళ్ళకు అయినాలెట్టి’ అని కాలు కదుపుతున్నారు. రీల్స్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ పాట గత రికార్డులన్నీ చెరిపేస్తూ తెలుగు తమిళ్ లో దూసుకుపోతుంది. కీర్తి సురేష్ అభినయంలో వచ్చిన ఈ పాటను అదే స్టెప్పులతో యువకులు కూడా రీల్స్ చేయడం విశేషం కాగా..