రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి భానుడి భాగభగలను బీట్ చేస్తుంది.. ఎవరి నోటా విన్న ఇదే డిస్కషన్.. తెలంగాణ లో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయి.. ఆంధ్రాలో కూటమి విజయం సాధిస్తుందా… వైసీపీ అధికారం నిలబెట్టుకుంటుందా..? సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు ఇదే ఆలోచన.. ప్రవాసాంధ్రులు ఓటేయాడానికి ఎప్పుడూ లేనంతగా స్వగ్రామాలకు పెద్దఎత్తున తరలి వెళ్లారు.. దాదాపు ఇరవై లక్షల మంది వెళ్లారని ఓ అంచనా.. వాళ్లంతా వారివారి గ్రామాల్లో ఓటేస్తున్నారు.. మరి మన సెలెబ్రెటీలు ఎవరెవరు ఎక్కడ ఓటేస్తున్నారు.. ఓబుల్‌రెడ్డి స్కూల్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి ఓటేస్తుండగా బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్ లు తమ ఓటుహక్కు వినియోహించుకొనున్నారు.జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మహేశ్‌బాబు, నమ్రత , మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ,శ్రీకాంత్ , జీవిత రాజశేఖర్ ఓటేయబోతున్నారు.ఎఫ్‌ఎన్‌సీసీ లో రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్ , విశ్వక్‌సేన్ , దగ్గుబాటి రాణా, సురేశ్ బాబు,జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్. జూబ్లీ హిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ లో రవితేజ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, మణికొండ హైస్కూల్ లో వెంకటేశ్, బ్రహ్మానందం, షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమౌళి రామారాజమౌళి , బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలని లో హీరో రామ్ పోతినేని, గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాల లో హీరో నాని, దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో హీరో సుధీర్ బాబు రోడ్ నెం.45, జూబ్లీహిల్స్ ఆర్థిక సహకార సంస్థలో అల్లరి నరేశ్, యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాలలో తనికెళ్ల భరణి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.