అమెరికా గగనాతలంలో విహరిస్తున్న చైనా నిఘా బెలూన్లను అమెరికా యుద్ధ విమానాలు కూల్చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా చేసిన పనికి చైనా మండిపడుతుంది. సాటిలైట్ సంబంధిత ఎయిర్ షిప్స్ తప్ప అవి నిఘా బెలూన్ లు కాదని చైనా చెబుతుంది. కానీ అమెరికా మాత్రం చైనా ఆర్మీ ద్వారా ఈ బెలూన్లు ప్రయోగించారని ఇవి నిఘా బెలూన్లని కచ్చితంగా చెబుతుంది. ప్రస్తుతం ఇలా ఇరు దేశాల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది. గత వారం రోజులుగా చైనా నిఘా బెలూన్ల హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువాం ప్రాంతాల్లో విహరిస్తున్నాయి. 40 మిత్ర దేశాలకు చెందిన భద్రతా ప్రతినిధులు, దౌత్యవేత్తలతో పెంటగాన్ అధికారులు ‘చైనా నిఘా బెలూన్ల వ్యవహారం’పై చర్చలు జరుపి ఫైనల్ గా తమ దేశ భద్రత దృష్ట్యా వాటిని కూల్చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా యుద్ధ విమానాల ద్వారా చైనా నిఘా బెలూన్లను కూల్చేసింది. ఈ విషయాన్ని అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఆ బెలూన్ల శకలాలను సేకరించిన విషయాన్ని సైతం మిత్ర దేశాలకు అమెరికా తెలియజేసింది. పేలిన శకలాలను ఎట్టి పరిస్థితుల్లో చైనాకు అప్పగించబోమని అమెరికా స్పష్టం చేసింది. సర్వేయలెన్స్ ఎయిర్‌షిప్స్‌గా భావిస్తున్న ఈ బెలూన్లు చైనా ఆర్మీ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) ద్వారానే ప్రయోగించబడుతున్నాయని, భారత్ సహా మిత్ర దేశాలను చైనా నిఘా బెలూన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అమెరికా హెచ్చరించింది. జపాన్, భారతదేశం, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌తో సహా పలు దేశాల సైనిక సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరిగిందని , ఈ క్రమంలోనే చైనా ఈ నిఘా బెలూన్లను ప్రయోగించిందని ప్రముఖ వార్తా ప్రచురణ సంస్థ ది వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో కూడా పేర్కొంది.