దాదాపుగా జనవరి నెల 13, 14, 15, తేదీల్లో వచ్చే భోగి, సంక్రాంతి, కనుమ, పండుగలు అప్పుడప్పుడు 14, 15, 16, తేదీల్లో రావడం సర్వసాధారణం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలంలో గ్రహ కదలికలకు అనుగుణంగా జరిగే తెలుగు వారి పెద్ద పండుగ 2050 వ సంవత్సరంలో మాత్రం జనవరి నెలలోనే 15, 16, 17, తేదీల్లో రానుంది వినాయక చవితి, దసరా, దీపావళి, ఉగాది, ఇలా మిగిలిన పండుగల తేదీల్లో ఎప్పుడూ మార్పులు చేర్పులు రావడం సహజం. తెలుగు మాసాల్లోని తిధులు ప్రకారమే పండుగల గణన జరుగుతుంది. పంచాంగానుసారమే అన్ని పండుగలు జరుగుతూవుంటాయి. ఆంగ్ల తేదీల్తో వాటికి పొంతన ఏమాత్రం ఉండదు. ఆంగ్ల తేదీలు తెలుగు తిధులు దాదాపుగా కలిసి వచ్చే ఒకే ఒక పండుగ సంక్రాంతి ఒక్కటే.. శూన్యమాసాలు వచ్చినా అధిక మాసాలు వచ్చినా సంక్రాంతి తేదీ సూర్యుడి మకర రాశి ప్రవేశం ఆంగ్ల తేదీలకు అనుసరించే వస్తుంది. అయితే మరో 27 ఏళ్ల తర్వాత అంటే 2050వ సంవత్సరం సంక్రాంతి తేదీ మారనుంది. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ప్లానెటరీ పొజిషన్ కారణంగా సంక్రాంతి తేదీ మారుతుంది అంటున్నారు పంచాంగ కారులు. మిగిలిన పండుగలన్నీ చంద్ర చక్రం పై ఆధారపడి వస్తుండగా మకర సంక్రాంతి మాత్రం సౌర చక్రంపై ఆధారపడి వస్తున్న కారణంగానే తేదీల పొంతన జరుగుతుందంటున్నారు. తాయిపొంగల్ (తమిళనాడు) ఉత్తరాయణ (గుజరాత్) లోహ్రి (పంజాబ్) మక్రాచేలా (ఒడిశా) మాఘి సంక్రాంతి(మహారాష్ట్ర) బొగాలి బిహు( అస్సాం) శిశుర్ సీన్క్రాత్త్ ( కాశ్మీర్) కిచిడీ పర్వ్ (ఉత్తర్ ప్రదేశ్, బీహార్) పేరుతో జరుపుకునే ఈ సంక్రాంతి ఒక్కటే గ్రహగమనాన్ని సైన్స్ తో కలిపి మనకి వస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి మరో విశేషం ఏంటంటే ఈరోజు పగలు రాత్రి కూడా సరి సమానంగానే ఉండనున్నాయి సూర్యుడు భూమి మీద సగం మాత్రమే పడటం వలన ఇది సంభవిస్తుంది ఇలా రాత్రి పగలు సమానంగా ఉండే రోజుని ఈక్వినాక్స్ (Equinox) అంటారు. ఇలాగే మళ్లీ మార్చి 21వ తేదీన సెప్టెంబర్ 23వ తేదీన కూడా ఈ ఈక్వినాక్స్ (Equinox) రానుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.