పెంపుడు జంతువుల పట్ల కొంత మందికి ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు… అవి జంతువులు అన్న కోణాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులు గానే వ్యవహరిస్తుంటారు.. అలాంటి జంతు ప్రేమికులు విస్తుపోయే ఘటన హైదరాబాద్ నేరేడ్ మెట్ లో జరిగింది. కనిపించకుండా పోయిన పెంపుడు పిల్లి తీవ్ర విషాధాన్ని నింపింది. నేరేడ్‌మెట్ జీకే కాలనీలో నివాసం ఉండే తాలూరి రూత్‌వర్ష పెంచుకుంటున్న పిల్లి గత నెల 29వ తేదీ నుండి కనిపించడం లేదు. దీంతో విపరీతంగా బెంగ పడిపోయిన కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు.. బట్ ప్రయోజనం లేకపోయింది.. తరువాత ఇంట్లో సీసీ కెమెరాలను పరిశీలించడంతో ముగ్గురు వ్యక్తులు ఇంట్లో చొరబడి పిల్లిని అపహరించి సంచిలో వేసుకొని పారిపోయినట్లు గుర్తించారు. దాంతో ప్రియమైన పిల్లి ఆచూకీ కోసం నేరేడ్‌మెట్ పోలీసులకు రూత్‌వర్ష ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వినాయక్‌నగర్‌కు చెందిన నర్సింహ, కిరణ్, శంకర్ నిందితులుగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. పిల్లి దొంగతనం పై విచారణ చేయగా ఆహారం కోసమే పిల్లిని దొంగిలించామని నిందితులు చెప్పిన సమాధానం విని ఖంగు తినడం పోలీసుల వంతయింది. పెంపుడు పిల్లి ని దొంగిలించి..కోసుకుని తిన్న ముగ్గురు నిందితులను నేరేడ్‌మెట్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.